Posts

Love Failure Quotes in Telugu with Heart Touching Images

Tamilrockers Telugu Movies 2020

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

Image
టెక్నాలజీ: వీడియో యాప్ జూమ్ ఆపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్లతో చైనీస్ యాప్ టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టింది. ఏప్రిల్ నుండి జూన్ చివరి వరకు చూస్తే జూమ్ యాప్ ఆపిల్ స్టోర్ నుండి 94 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. అంటే టిక్‌టాక్ యొక్క 67 మిలియన్ డౌన్‌లోడ్ల రికార్డు కంటే 40 శాతం ఎక్కువ. మొత్తముగా చూస్తే రెండవ త్రైమాసికంలో, అటు యాప్ స్టోర్ ఇటు గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ జూమ్ 303 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. మరోవైపు ప్రపంచవ్యాప్తముగా అన్ని యాప్ డౌన్‌లోడ్‌లు రెండవ త్రైమాసికంలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 37.8 బిలియన్లకు చేరుకున్నాయి, అంటే ఇది సంవత్సరానికి 31.7 శాతం పెరుగుదల. దానితో యాప్ స్టోర్ ఇన్స్టాలేషన్స్ 22.6 శాతం పెరిగి 9.1 బిలియన్లకు చేరుకోగా, గూగుల్ ప్లే 34.9 శాతం వృద్ధిని సాధించి 28.7 బిలియన్లకు చేరుకుంది.

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

Image
జాతీయం:  మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది కవాటం ఉన్న ఎన్-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జన రల్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. Tamilrockers Telugu Movies ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాస్తూ, ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధా రణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్స హించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో కన్నుమూత

Image
మధ్యప్రదేశ్: గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జూన్ 11న ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో లక్నోలోని ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితమే ఆయన పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి మూత్రపిండాల,కాలేయం.ఊపిరితిత్తులు పని చేయకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఆయన శరీరం వైద్యానికి సహకరించక మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. టాండన్ మరణంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు మధ్య ప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. యూపీ రాజకీయాలలో ఆయనది ఘనమైన చరిత్ర. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ తో మొదటి నుంచి అనుబందం ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు.

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి..?

Image
ఆంధ్రప్రదేశ్: రాజ్యసభ సభ్యులుగా మంత్రులు ఎన్నికైన కారణంగా, కొత్తగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జరిగే మార్పులలో వీరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి అవకాశం రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిసి వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవిని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఇవ్వవచ్చని వైస్సార్సీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కి రహదారులు భవనాలు శాఖ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ లను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొంతమంది ముఖ్యనేతలు చెప్తున్నారు. ఏదేమైనా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!

Image
హైదరాబాద్: అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన 31వ జన్మదినం కావడంతో ఆమె సోమవారం హైదరాబాదులోని జూ పార్క్ ను సందర్శించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. ఇకపై రాణి యొక్క బాగోగులను ఉపాసన రాంచరణ్ చూసుకోనున్నారు. ఈ మేరకు ఆమె నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు 5 లక్షల రూపాయల చెక్ అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు జంతువుల పట్ల ప్రేమ పూరితంగా వ్యవహరించాలని అలాగే స్వచ్చందంగా జూ లో ఉండే జంతువులను ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాసన  అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

శరత్ కుమార్‌తో ఆహా ఒటిటి హై బడ్జెట్ వెబ్ సిరీస్

Image
టాలీవుడ్: తమిళ నటుడు శరత్ కుమార్ ఆహా ఒటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను వెబ్ సిరీస్ తో పలకరించనున్నారు. ఇటీవల, శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, రాధిక తన డిజిటల్ అరంగేట్రం యొక్క కొన్ని పోస్టర్లను "బర్డ్స్ ఆఫ్ ప్రే - ది హంట్ బిగిన్స్"  పేరిట విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ అదే పేరుతో ఉన్న అర్చన శరత్ యొక్క నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ ప్రాజెక్ట్ కోసం శరత్ కొత్త కొత్త లుక్ లోనికి మారారు. పిల్లలపై జరుగుతున్నవేధింపులకు వ్యతిరేకంగా ఈ సిరీస్ రానుంది అలాగే శరత్ కుమార్ ఒక శక్తివంతమైన మాజీ పోలీసుగా కనిపించనున్నారు. భార్య రాధిక బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్  నుంచి ఈ ప్రాజెక్టు విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ దక్కించుకుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారని తెలుస్తుంది.