Posts

Showing posts from July, 2020

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

Image
టెక్నాలజీ: వీడియో యాప్ జూమ్ ఆపిల్ యాప్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్లోడ్లతో చైనీస్ యాప్ టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టింది. ఏప్రిల్ నుండి జూన్ చివరి వరకు చూస్తే జూమ్ యాప్ ఆపిల్ స్టోర్ నుండి 94 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. అంటే టిక్‌టాక్ యొక్క 67 మిలియన్ డౌన్‌లోడ్ల రికార్డు కంటే 40 శాతం ఎక్కువ. మొత్తముగా చూస్తే రెండవ త్రైమాసికంలో, అటు యాప్ స్టోర్ ఇటు గూగుల్ ప్లే స్టోర్ రెండింటిలోనూ జూమ్ 303 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. Read: Upcoming Telugu movies 2021 in OTT October మరోవైపు ప్రపంచవ్యాప్తముగా అన్ని యాప్ డౌన్‌లోడ్‌లు రెండవ త్రైమాసికంలో ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 37.8 బిలియన్లకు చేరుకున్నాయి, అంటే ఇది సంవత్సరానికి 31.7 శాతం పెరుగుదల. దానితో యాప్ స్టోర్ ఇన్స్టాలేషన్స్ 22.6 శాతం పెరిగి 9.1 బిలియన్లకు చేరుకోగా, గూగుల్ ప్లే 34.9 శాతం వృద్ధిని సాధించి 28.7 బిలియన్లకు చేరుకుంది.

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

Image
జాతీయం:  మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది కవాటం ఉన్న ఎన్-95 మాస్కులను ప్రజలు వినియోగించ వద్దని కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్ జన రల్ హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, దీనివల్ల వైరస్ సోకే ప్రమాదం ఉందని తెలిపారు. Read: Romantic Telugu Movie Download Movierulz ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాస్తూ, ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో సాధా రణ మాస్కులు ధరించేలా ప్రజలను ప్రోత్స హించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు. Read More@ Tollywood Ace

మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో కన్నుమూత

Image
మధ్యప్రదేశ్: గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జూన్ 11న ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో లక్నోలోని ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల క్రితమే ఆయన పరిస్థితి విషమించింది. అప్పటి నుంచి మూత్రపిండాల,కాలేయం.ఊపిరితిత్తులు పని చేయకపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఆయన శరీరం వైద్యానికి సహకరించక మంగళవారం ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన వయస్సు 85 సంవత్సరాలు. టాండన్ మరణంతో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ కు మధ్య ప్రదేశ్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి అనుచరుడిగా భారతీయ జనతా పార్టీతో ఆయన రాజకీయ జీవితం పెనవేసుకుపోయింది. యూపీ రాజకీయాలలో ఆయనది ఘనమైన చరిత్ర. మాయావతి (సంకీర్ణ ప్రభుత్వం), కల్యాణ్ సింగ్ మంత్రివర్గాలలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ తో మొదటి నుంచి అనుబందం ఉన్న నేతగా ఆయన గుర్తింపు పొందారు.

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి..?

Image
ఆంధ్రప్రదేశ్: రాజ్యసభ సభ్యులుగా మంత్రులు ఎన్నికైన కారణంగా, కొత్తగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జరిగే మార్పులలో వీరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి అవకాశం రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిసి వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవిని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఇవ్వవచ్చని వైస్సార్సీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కి రహదారులు భవనాలు శాఖ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ లను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొంతమంది ముఖ్యనేతలు చెప్తున్నారు. ఏదేమైనా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!

Image
హైదరాబాద్: అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన 31వ జన్మదినం కావడంతో ఆమె సోమవారం హైదరాబాదులోని జూ పార్క్ ను సందర్శించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు. ఇకపై రాణి యొక్క బాగోగులను ఉపాసన రాంచరణ్ చూసుకోనున్నారు. ఈ మేరకు ఆమె నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు 5 లక్షల రూపాయల చెక్ అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు జంతువుల పట్ల ప్రేమ పూరితంగా వ్యవహరించాలని అలాగే స్వచ్చందంగా జూ లో ఉండే జంతువులను ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాసన  అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

శరత్ కుమార్‌తో ఆహా ఒటిటి హై బడ్జెట్ వెబ్ సిరీస్

Image
టాలీవుడ్: తమిళ నటుడు శరత్ కుమార్ ఆహా ఒటిటి ద్వారా తెలుగు ప్రేక్షకులను వెబ్ సిరీస్ తో పలకరించనున్నారు. ఇటీవల, శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, రాధిక తన డిజిటల్ అరంగేట్రం యొక్క కొన్ని పోస్టర్లను "బర్డ్స్ ఆఫ్ ప్రే - ది హంట్ బిగిన్స్"  పేరిట విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ అదే పేరుతో ఉన్న అర్చన శరత్ యొక్క నవల ఆధారంగా రూపొందించబడింది. Read: New OTT Releases 2021-2022 ఈ ప్రాజెక్ట్ కోసం శరత్ కొత్త కొత్త లుక్ లోనికి మారారు. పిల్లలపై జరుగుతున్నవేధింపులకు వ్యతిరేకంగా ఈ సిరీస్ రానుంది అలాగే శరత్ కుమార్ ఒక శక్తివంతమైన మాజీ పోలీసుగా కనిపించనున్నారు. భార్య రాధిక బ్యానర్ రాడాన్ మీడియా వర్క్స్  నుంచి ఈ ప్రాజెక్టు విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క తెలుగు స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ దక్కించుకుంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారని తెలుస్తుంది.

జియో టీవీ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు?

Image
టాలీవుడ్: రిలయన్స్ కొత్తగా జియో టీవీ ప్లస్ ను ప్రారంభించించిన విషయం తెలిసిందే! ఈ జియో టీవీ ప్లస్ ద్వారా 12 ఓటీటీ ప్లాటుఫార్మ్స్ యొక్క కంటెంట్ ను ఒకేచోట చూడొచ్చు. అంటే ఒక్క లాగిన్ తో శాటిలైట్ ఛానల్స్ మరియు ఓటీటీ కంటెంట్ చూసే వీలును జియో కల్పించబోతుంది. దీనికి సంబందించిన పనులు మొదలయ్యాయి. అయితే ఈ ప్రోడక్ట్ ప్రచారం కోసం సౌత్ ఇండియా నుంచి జియో, మహేష్ బాబును సంప్రదించిందని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియవలసి వుంది. Enemy Tamil movie download Isaimini నార్త్ ఇండియాలో ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో జియో టీవీ ప్లస్ కు ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సౌత్ ఇండియాకు ఒక్క హీరోతోనే చేయించాలనే ఉద్దేశ్యంతో, అన్ని భాషల్లో మంచి గుర్తింపు ఉన్న మహేష్ బాబును సంప్రదించారట. ఈ విషయానికి సంబంధించి చర్చలు పూర్తి అయ్యాయని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందంటున్నారు. దీంతో మహేష్ బాబు అకౌంట్ లో మరో పెద్ద బ్రాండ్ చేరనుంది.

ఆక్స్ ఫర్డ్ డెవలప్ చేసిన కరోనా వ్యాక్సిన్ రిజల్ట్ వచ్చేసిందోచ్..!

Image
అంతర్జాతీయం: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం, అస్ట్రాజెనికా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఫలితం ఎట్టకేలకు వచ్చింది. ఈ వ్యాక్సిన్ పేరును 'ChAdOxI'గా నుంచి  AZD1222గా మార్చారు. అయితే ఇప్పటి వరకు రెండు దశల్లో నిర్వహించిన ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. వ్యాక్సిన్ బాగా పనిచేస్తుందని, వ్యాక్సిన్ ఇచ్చిన వారంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే డెవలప్ చేసిన ChAdOx1 nCoV-19/ AZD1222 వ్యాక్సిన్ తో రోగి యొక్క రోగనిరోధక శక్తి పెరిగినట్లుగా శాస్త్రవేత్తలు వెల్లడించారు. హ్యుమన్ ట్రయల్స్ లో 1077 మంది పాల్గొన్నారు. అందరిలోనూ యాంటీబాడీలు, టి కణాలు విడుదలైనట్లు వారు గుర్తించారు. వ్యాక్సిన్ తీసుకున్న పద్నాలుగు రోజులకు టి కణాలు, 28 రోజులకు యాంటీబాడీలు తీవ్ర దశకు చేరుకున్నాయని తెలిపారు. మరిన్ని మంచి ఫలితాలు చూసేందుకు త్వరలో బ్రిటన్ లో పదివేల మందికి, అమెరికాలో 30 వేల మందికి, దక్షిణాఫ్రికాలో 2వేల మంది అలాగే బ్రెజిల్ లో 5వేల మందిపై ప్రయోగాలు చేయనున్నారు. వ్యాక్సిన్ ప్రయోగం విజయవంతమైతే, ఈ ఏడాది చివరకు వ

ఓటీటీ పైకి తమన్నా "దట్ ఈజ్ మహాలక్ష్మి"?

Image
టాలీవుడ్: హీరోయిన్ తమన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "దట్ ఈజ్ మహాలక్ష్మి" అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకానుందని సమాచారం. తమన్నా భాటియా నటించిన ఈ చిత్రం 2018 సెప్టెంబర్‌లో థియేటర్‌లో విడుదలకావలసి వుంది. అయితే, కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా ఈ చిత్రం ఆలస్యం అయింది. "దట్ ఈజ్ మహాలక్ష్మి" హిందీ చిత్రం క్వీన్ (2013) యొక్క అధికారిక తెలుగు రీమేక్. అయితే తమన్నా పాత్రను తమిళంలో కాజల్ అగర్వాల్, మలయాళంలో మంజిమా మోహన్ చేశారు. తమన్నా ప్రధాన పాత్రలో వస్తున్న "దట్ ఈస్ మహాలక్ష్మి", ఒక అమ్మాయి యొక్క వ్యక్తిగత జీవితానికి అద్దం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాలో షిబాని దండేకర్, సిద్దూ జోన్నలగడ్డ, సి.వి.ఎల్. నరసింహారావు, జెఫ్రీ హో తదితరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. దట్ ఈస్ మహాలక్ష్మికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

కోవిడ్ పేషెంట్ రికవరీ: డాన్సులతో స్వాగతం పలికిన కుటుంభం

Image
వైరల్ వీడీయో: అసలైన సెలబ్రేషన్ అంటే ఇది కదా అంటున్నారు ఈ వీడియో చూసినవారు. కరోనా రావడంతో ఆమె క్వారంటైన్ సెంటర్ లో కొన్ని రోజులు వుండి చికిత్స చేయించుకుని కరోనా పై జయించింది. ఇంటికి తిరిగి రాగానే ఆమెకు అందిన స్వాగతం చూస్తే అందరూ అవ్వక్కవాల్సిందే. కోవిడ్ నుంచి రికవరీ అయిన పేషెంట్ చెల్లెలు, చిందులేస్తూ రికవరీ అయిన ఆమె సోదరికి డాన్స్ స్టెప్పులతో ఇలా ఆహ్వానం పలికింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. వీడియో చుసిన వారందరూ, ఇది కదా లైఫ్ అంటున్నారు. మరోవైపు దేశంలో కరోనా రోగులపై సొంతవారే దాడులు, సూటి పోటీ మాటలు, హీనంగా చూడటం లాంటి వార్తలు రోజూ వింటూనే వున్నాం. अस्पताल के “कोरोना वार्ड” से छुट्टी के बाद घर में स्वागत. बीमारी आएगी और जाएगी... लेकिन ‘जीने का अंदाज़’ ऐसा होना चाहिए.👍👌 सौजन्य: फ़ेसबुक pic.twitter.com/ZS31mM1hUh — Awanish Sharan (@AwanishSharan) July 19, 2020 ఇంకా చదవండి: పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో.. అదే మర్చిపోయారే!

కేసీఆర్‌ని తన వివాహానికి ఆహ్వానించిన హీరో నితిన్..

Image
టాలీవుడ్: హీరో నితిన్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు షాలినీని ఈ నెల 26న ఫలక్‌నామా ప్యాలస్‌లో వివాహం చేసుకోనున్నాడు. వివాహాల విషయంలో ప్రభుత్వాలు కొన్ని నియమాలు అనుసరించాలని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నితిన్ షాలినీలా వివాహం కేవలం సన్నిహితుల సమక్షంలో జరగనుంది. టాలీవుడ్ లోని సన్నిహితులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం వుంది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని హీరో నితిన్ తన పెళ్లికి ఆహ్వానించాడు. కొంతకాలంగా ప్రేమలో ఉన్న నితిన్, షాలిని ఇరువైపు కుటుంభాల అంగీకారంతో వివాహం చేకుంటున్నారు. ఇప్పటికే వివాహం జరగాల్సి వున్నా లొక్డౌన్ ఆంక్షలు వల్ల వాయిదా పడింది. 2021లో నితిన్ వరుస సినిమాలతో రానున్నాడు. ప్రస్తుతం మూడు సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇంకా చదవండి: వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు

తిరుమల కొండపై 170కు పైగా కరోనా పాజిటివ్ కేసులు..!

Image
తిరుపతి: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చుసినా కరోనా కలవరమే. దేవుడా కరోనాను తొందరగా మానుంచి దూరం చేయమని గుడికెళ్ళి మొక్కుకుందాం అనుకున్నా గుడిలో అర్చకులను కూడా కరోనా వదల్లేదు! తిరుమలపై కొండపై 21 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసిందే, అలాగే ఇతర సిబ్బందిలో కూడా కొరోనా లక్షణాలు కనిపించడంతో తిరుమల తిరుపతి వాసులు భయపడుతున్నారు. తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రసాద తయారీ కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లో 170కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మరికొంతమందికి కరోనా లక్షణాలున్నాయనే వార్తలతో అధికారులు వారి రక్త నమూనాలను సేకరించారు. తాజాగా మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కొరోనా వళ్ళ మరణించారన్న వార్త అక్కడి వారిని కలవరానికి గురిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాలలోని వ్యక్తులకు కూడా కరోనా సాకోడంతో కలకలం రేగింది. దీనితో టీటీడీ అనుబంధ ఆలయాలను ఈరోజు నుంచి మూసివేయడం జరిగింది, అయితే తిరుపతిలో దర్శనాల నిలిపివేతపై టిటిడి బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపగా, ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్ప

ఒడిశా‌లో కనిపించిన అరుదైన పసుపు పచ్చ తాబేలు: వైరల్ వీడియో

Image
ఒడిశా: ఎప్పుడూ చూడని అరుదైన జంతువులూ, వన్య ప్రాణులు జనాలను కనువిందుచేస్తాయి. కానీ వాటి సంరక్షణ ఎంతో ముఖ్యం. అవి జనారణ్యంలోకి వచ్చినప్పుడు వాటిని కొంతమంది పట్టించుకోరు అలాగే వాటి సంరక్షణ తెలియక పరోక్షంగా వాటి చావుకు కారణమౌతారు. అయితే వాటి సంరక్షణకు అటవీ శాఖ ఎప్పుడూ సిద్దంగానే ఉంటుంది. అలాంటి అరుదైన వన్య ప్రాణులు కనిపించినప్పుడు అటవీ శాఖ సిబ్బందికి తెలియచేయటం ఎంతో ముఖ్యం. ఇక విషయానికొస్తే ఒడిశాలో ఒక అరుదైన పసుపు పచ్చ తాబేలు జనాలకు కనువిందు చేసింది. అది జనారణ్యంలోకి రావడంతో బాలసోర్ జిల్లాలోని సోరో బ్లాక్‌లోని సుజాన్‌పూర్ గ్రామానికి చెందిన స్థానికులు దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే అటవీశాఖ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ, ఇదొక అరుదైన జాతి తాబేలని, ఇంతకుముందు ఇటువంటిది ఇక్కడ చూడలేదని తెలియచేశారు. అటవీ శాఖ ప్రకారం, ఈ తాబేలు 30 కిలోల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంది, అలాగే దాని గరిష్ట జీవితం 50 సంవత్సరాలు. ఈ విధంగా అక్కడి స్థానికులు బాధ్యతగా వ్యవహరించి ఆ తాబేలును అటవీశాఖకు అప్పచెప్పారు. మీకు కూడా ఇలాంటి అరుదైన జంతువులు లేదా వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శేఖకు తెలియజేయండి. A rare yellow tur

అలీ సైబర్ ఫిర్యాదు వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులు..!

Image
టాలీవుడ్: ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు సర్వసాధారణం అయిపోయాయి. ఒక సెలబ్రిటీ మీద పదుల సంఖ్యలో నకిలీ ఖాతాలు సృష్టించబడుతున్నాయి. కొన్ని సార్లయితే ఈ నకిలీ ఖాతాల ద్వారా కొంతమంది పోకిరీలు సెలబ్రిటీస్ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు కమెడియన్ అలీ ఎదుర్కొన్నారు. 2019 ఎన్నికలలో, నటుడు అలీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారని పీకే అభిమానులు భావించారు, ఎందుకంటే ఇద్దరూ అటు తెరపై ఇటు తేరా వెనుక కూడా మంచి మిత్రులు. కానీ ఆలీ మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అలీని ఉద్దేశించి ప్రచారంలో కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. పవన్ చేసిన కామెంట్స్ కు అలీ తనదైన శైలిలో జవాబిచ్చారు. అయితే ఎన్నికల తరువాత వీరి మధ్య దూరం పెరిగింది. అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే హ్యాష్ ట్యాగును ట్రెండింగ్ చేస్తున్నారు. అదే హ్యాష్ ట్యాగ్ తో అలీ అకౌంట్ తో ఒక ట్వీట్ వైరల్ అయింది. అలీ ట్వీట్ చేసినట్లు చేసిన ఆ ట్వీట్ లో “వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధ

హైదరాబాద్‌లో నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

Image
తెలంగాణ: హైదరాబాద్‌లో కొత్తగా మరో డ్రగ్ రాకెట్ గుట్టురట్టైంది. తార్నాకలో ఇద్దరు నైజీరియన్ హైదరాబాద్‌ డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్‌ ఎన్‌ ఫోర్స్ ‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ జాది పాస్కెల్‌ అతని ప్రియురాలు ఇబేరా మోనికలను అరెస్టు చేశామని అధికారులు తెలుయచేశారు, వారి దగ్గర నుంచి 104 గ్రాముల కొకైన్‌ అలాగే లక్షా 64వేలు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం వీళ్ళు ఒక గ్రాము కొకైన్ 8 వేళ రూపాయలకు అమ్ముతున్నారు. వీరిద్దరూ నివాసముంటున్న తార్నాకలోని నాగార్జున కాలనీలోని అపార్టుమెంట్ లో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు ముఠా సభ్యుల కోసం గాలిస్తున్నన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీరు ముంబయి నుంచి హైదరాబాద్‌ కు డ్రగ్స్‌ ను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చదవండి: హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

జులై 25న తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ ఫలితాలు..!

Image
తెలంగాణ: రాష్ట్ర ఇంటర్ రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలను ఈనెల 25న ప్రకటించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ కోసం దాదాపు 60 వేలు, మార్కుల రీ కౌంటింగ్‌ కోసం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్టాఫ్ తగ్గడంతో ఇంటర్‌ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ ఫలితాల విషయంలో జాప్యం జరిగింది. మరోవైపు తెలంగాణలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థులను పాస్‌ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరకీ తెలిసిందే.

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

Image
తెలంగాణ: విరసం నేత వరవరరావుకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే ఆయనను ఇప్పడు మెరుగైన చికిత్స కోసం నానావతి హాస్పిటల్ కు మార్చడం జరిగింది. 81 వయసులో వున్న వరవరరావు ఆరోగ్యం క్షీణించినందున బెయిల్ కోరుతూ సోమవారం బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యానికి గురైన అతన్ని సోమవారం జెజె హాస్పిటల్ న్యూరాలజీ విభాగానికి తరలించారు. ఆ తర్వాత కోవిడ్ -19 కు పాజిటివ్అని తేలింది. వరవరరావు ఆరోగ్యం మీద చాలామంది ప్రముఖులు స్పందిస్తూ అతన్ని విడిచిపెట్టాలని కేంద్రాన్ని కోరారు. మాజీ కేంద్ర మంత్రి చిదంబరం వరవరరావును వెంటనే విడదల చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు కూడా వరవరరావు ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. దయచేసి విడుదల చేయాలని కోరారు, 46 ఏళ్ళ క్రితం ఎమర్జెన్సీ సమయంలో, మీరు, నేను, వరవరరావు సహచరులమని గుర్తుచేశారు. అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తున్న వైద్యులు, ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు, కానీ అతని

ఏపీలో 5 వేలకు పైగా తాజా కేసులు: 24 గంటల్లో ఇదే అతి పెద్ద సంఖ్య

Image
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఎలా వుందని తెలుసుకోవాలంటే రోజురోజుకూ పెరుగుతున్న ఈ కేసుల సంఖ్యను గమనిస్తే చాలు. ప్రశుతం ఆంధ్రప్రదేశ్ లో వైరస్ యొక్క తీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. అయితే నిన్నమొన్నటి వరకు 3 వేలు దాటని ఈ కేసులు ఏకంగా ఇప్పడు 5 వేలకు పైగా నమోదయ్యాయి, 24 గంటల్లో నమోదయిన కేసుల్లో ఇదే అతి పెద్ద సంఖ్య. అలాగే గడిచిన 24 గంటల్లో ఏకంగా 56 మరణాలు సంభవించడం ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 642కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49650 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 26118గా ఉండగా మరోవైపు 22890 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు 642 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1000 కేసులు దాటడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది. ఇంకా చదవండి: పరోటా కోసం క్వారంటైన్ సెంట‌ర్ నుంచి బయటకొచ్చిన వైరస్ బాధిత

పరోటా కోసం క్వారంటైన్ సెంట‌ర్ నుంచి బయటకొచ్చిన వైరస్ బాధితుడు..!

Image
తమిళనాడు : కరోనా వల్ల రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. వ్యాధి సోకిన రోగులు ఎదో ఒక చిన్న చిన్న కారణాలతో పారిపోతున్నారు. కొత్తగా తమిళనాడులో ఒక రోగి పోరాటా తినాలనిపించి జనాల్లోకొచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. ఒకవైపు తమిళనాడు దేశంలోనే కొరోనా పీడితుల రాష్టాల్లో మూడవ స్థానంలో ఉంటే, మరోవైపు ఇలాంటి ఘటనలు ప్రజలకు కలవరానికి గురిచేస్తున్నాయి. బయటకి వెళ్లకుండా కొన్ని రోజులు క్వారంటైన్ లో వుండండ్రా బాబు అని ప్రభుత్వం మొత్తుకుంటుంటే కొంతమంది రోగులు మాత్రం ఏముందిలే అనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఆచారిపాలెంలో ఒక ప్రభుత్వ స్కూల్ భవనాన్ని క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చారు. అందులో సుమారు 150 మంది వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ కరోనా బాధితుడికి మాత్రం పరోటా తినాలని కోరిక కలిగింది. దీంతో అతను ఆలస్యం లేకుండా వెంటనే బయటకు వెళ్లి ఎలా అయినా పరోటా తెచ్చుకుని తినాలని నిర్ణయించుకన్నాడు. వెంటనే ఆ క్వారంటైన్ సెంట‌ర్ భవనం గోడ దూకి బయటకు వచ్చాడు. అయితే అతను బయటకు వచ్చే క్రమంలో నాలుగు ఇళ్లను దాటుకుంటూ రావడంతో ఇళ్లలో వాళ్ళు బయాందోళన

ప్రభాస్ 21వ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్, హీరోయిన్ దీపికా పదుకొనే...!

టాలీవుడ్ : ప్రభాస్ 21వ చిత్రంలో దీపికా పదుకొనేని హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు వస్తున్న వార్త ఏంటంటే ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా అరుదు. అయితే అడపా దడపా ఇతర భాషల్లో తీస్తుంటారు కానీ అవి జనాలను ఎక్కువగా ఆకట్టుకోలేదు. దీనికి కారణం బడ్జెట్, అవును ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా తియ్యాలంటే పెద్ద బడ్జెట్ తప్పనిసరి. ఇందువల్లే చాలా మంది ఈ జానర్ లో సినిమాలు తీయడానికి ముందుకురారు. అయితే మహానటి సినిమా తరువాత మళ్ళీ ఊపు మీదున్న వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరక్కించనుంది. అలాగే ఈ సినిమా వైజయంతి మూవీస్ యొక్క ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా. Read:  OTT Movies List వైజయంతి మూవీస్ యొక్క ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో దీనిని ఇండియాతో పాటు ఇతర దేశ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది. నాగ్ అశ్విన్ మహానటి లాంటి వరల్డ్ క్లాస్ బయోగ్రఫీ సినిమా తరువాత తీసుకువస్తున్న కథ చాలా కొత్తగా ఉంటుందని, ఇప్పటివరకు ఇండియాలో రాని ఒక సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఇందులో ఉంటుందని అంటున్నారు. తెలుగులో వచ్చిన భారీ సైన

రోడ్డుపై నిద్రించిన ఖడ్గమృగం: వైరల్ వీడియో

అస్సాం (వైరల్ వీడియో) : అస్సాంలో వరదలు కారణంగా అక్కడి ప్రజలతో పాటు వన్య ప్రాణులు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ప్రజలను ఆదుకోటానికి ప్రభుత్వాలుంటే అక్కడి జంతువులు మాత్రం ఏ దిక్కులేక కొత్త ప్రాంతాలకు తరలివస్తున్నాయి. ఇలా అలసిపోయి వచ్చిన ఒక ఖడ్గమృగం జాతీయ రహదారి 37 కు దగ్గర్లో వున్న రోడ్డుపై సేదతీరుతూ జనాల కంట పడింది. ఇంకేం, జనాలందరూ తమ స్మార్ట్ ఫోనులు తీసి ఖడ్గమృగం పడుకున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే అక్కడి అధికారులు మాత్రం దాని నిద్రకి ఎటువంటి భంగం కలిగించకుండా, అలాగే అది జనాల పైకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఖడ్గమృగాన్ని తిరిగి సురక్షితమైన ప్రాంతానికి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని అస్సాం అధికారులు అక్కడివారికి సూచించారు. ఈ ఖడ్గమృగం వీడియోను కాజీరంగ నేషనల్ పార్క్ మరియు టైగర్ రిజర్వ్ అధికారులు తమ ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. ఖడ్గమృగం రహదారిపై ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు ఈ వీడియో చూసిన కొంతమంది జంతు ప్రేమికులు మురిసిపోతుంటే మరికొంతమంది దానికెన్ని భాదలొచ్చాయో అని వాపోతున్నారు. A rhino have strayed out near bandar dhubi area

ఆర్‌జివి పవర్ స్టార్ టికెట్ ధర 150.. బ్లాక్‌లో 250..!

Image
టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా వినూత్నంగా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన రిలీజ్ చేసిన నగ్నం, క్లైమాక్స్ సినిమాలు పేలవంగా ఒక షార్ట్ ఫిలింను తలపించేలా ఉండటంవల్ల చాలా మందికి నచ్చలేదు. కానీ అవి డబ్బులు మాత్రం రాబట్టాయి. దీనికి కారణం పే పేర వ్యూ, అంటే ఆన్లైన్ లో ఆర్‌జివి సినిమా చుసిన ప్రతిసారి డబ్బు చెల్లించి చూడాల్సిందే. దీనివల్ల సినిమా ఎలావున్నా ప్రొడ్యూసర్లకు డబ్బు గిడుతుంది. అయితే ఈ పే పేర వ్యూ ప్రక్రియ మాత్రం పెద్ద సినిమాలకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగబడుతుందనే చెప్పాలి. ఇక విషయానికొస్తే ఆర్‌జివి తన సొంతంగా ఒక వెబ్ అప్లికేషన్ నిర్మించుకున్నారు. దీనికి " ఆర్‌జివి వరల్డ్ థియేటర్ " అని పేరుపెట్టుకున్నారు. తాను తీయబోయే సినిమాలన్నీ ఈ ఆర్‌జివి వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీనిలో మొట్టమొదటగా రిలీజ్ చేసే సినిమా " పవర్ స్టార్ " అని, దీనిని జులై 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా చూడాలంటే టికెట్ ధర 150 గా నియమించారు. కానీ ఈ ధర కేవలం ఆరోజు 11 గంటల సమయం లోపు కొనిన వారికి మాత్రమే, ఏవేరైతే 11 గంటలు దాటి టికెట్ కొంటారో వారు తప్పనిసరిగా బ్ల

నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: వీడియో గేమ్‌లో గెలిస్తే 1,000 నెలులు ఫ్రీ

Image
టెక్నాలజీ/గేమింగ్: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైతే వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్ చేస్తారో వారికి 1000 నెలలు అనగా 83 సంవత్సరాల ఉచిత నెట్‌ఫ్లిక్స్ సేవలను అందించనుంది. అయితే ఉచిత సేవలను పొందాలంటే వినియోగదారులు ‘ద ఓల్డ్‌ గార్డ్‌’ అనే మినీ వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్‌ చేయవలసి ఉంటుంది, గేమ్ ఆడటానికి నెట్‌ఫ్లిక్స్ ఖాతా అవసరం లేదు. ‘ద ఓల్డ్‌ గార్డ్‌’, చార్లిజ్ థేరోనే నటించిన నెట్‌ఫ్లిక్స్ సినిమా. ఇది ఈమధ్యనే (జులై 10న) రిలీజయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఇదే పేరుతో నెట్‌ఫ్లిక్స్ కొత్త వీడియో గేమ్‌ తీసుకువచ్చింది. ఈ వీడియో గేమ్ ఆడి అత్యధిక స్కోర్‌ సాధించిన వారికి 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్‌ ఉచిత సేవలను పొందవచ్చు. అయితే ఈ వీడియో గేమ్‌ను మూడు రోజుల పాటు అంటే జులై 17 నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఈ ఉచిత సేవల ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. దీనికోసం ఒక వెబ్సైటును కూడా రూపొందించింది. అయితే ఈ గేమ్ 50 యునైటెడ్ స్టేట్స్ మరియు డి.సి. యొక్క చట్టబద్ధమైన నివాసులకు మాత్రమే. అంటే ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఇతర దేశాలకు వర్తించదు. ఈ అర్హత తెలు

కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు రష్యా హ్యాక్ చేస్తోంది: బ్రిటన్

Image
అంతర్జాతీయం: ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నీ కొరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టే పనిమీదుంటే రష్యా మాత్రం మా కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలను హ్యాకింగ్ చేస్తోందని తీవ్ర ఆరోపణలు చేసింది బ్రిటన్. ఈ ఆరోపణలతో కెనడా, యుఎస్ కూడా ఏకీభవించాయి. కొంతమంది రష్యాకు చెందిన గూఢచారులు తమయొక్క కరోనా వైరస్ వ్యాక్సిన్ పరిశోధనలకు సంభందించిన డేటాను తస్కరించేందుకు కుట్ర చేశారని బ్రిటిష్ ఇంటలిజెన్స్ చెప్తోంది. కాజీ బేర్, డ్యూక్స్ పేర్లతో కొంతమంది మా డేటా మీద నిఘా ఉంచారు. అయితే మేము మా డేటాను రక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మీడియాకు తెలిపింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు కెనడాలోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం, కాజీ బేర్, డ్యూక్స్ అని పిలువబడే హ్యాకింగ్ గ్రూప్ కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో పాల్గొన్న విద్యా మరియు ఔషధ పరిశోధన సంస్థలపై సైబర్ దాడి చేస్తోందని చెప్పారు. అయితే ఇదే హ్యాకింగ్ గ్రూప్ 2016 యుఎస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో డెమొక్రాటిక్స్ యొక్క ఇమెయిల్ ఖాతాలను హ్యాకింగ్‌ చేసిందని తెలిపాయి. అయితే రష్యా మాత్రం ఈ దేశాల వాదనలను ఖండించింది. వ్యాక్సిన్ అభివృద్ధిలో రష్

ఆంధ్రాలో ఇప్పుడు వివాహాలకు అనుమతులు సులభం..!

Image
ఆంధ్రప్రదేశ్: కరోనా మహమ్మారి తో ఇప్పుడు వివాహాలకు కూడా అనుమతులు తీసుకోవాలిసిన పరిస్థితి, ఈ సమయంలో వివాహాలు చేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది మన దేశ ప్రభుత్వం, సాధ్యమైనంత వరకు పెళ్ళిళ్ళను వాయిదా వేసుకోమని చెప్పింది. Telugu Movies Adda అయితే ప్రభుత్వ ఆదేశాలకు విరుద్దంగా చేసుకున్నవారు మీద అధికారులు కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇలా అనుమతులు లేకుండా జరిగిన పెళ్లిళ్లకు వెళ్లిన వారికి కరోనా వ్యాధి సోకిందనే వార్తలు చాలానే వచ్చాయి. మొన్నటికి మొన్న బీహార్ లోని ఒక పెళ్ళికి హాజరైన 100 మందికి కరోనా సోకింది. ఎలాంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ లో కూడా వెలుగుచూశాయి. అయితే అనుమతులు తీసుకుని, కరోనా నియమాలను అనుసరిస్తూ పెళ్లిళ్లు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఈ వివాహాల విషయలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులను కొంచం సులభం చేసిందనే చెప్పాలి. ఇప్పటి వరకు పెళ్లి జరగాలంటే జిల్లా కలెక్టర్ నుంచి అనుమతి తప్పనిసరి. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో, ఏపీ ప్రభుత్వం ఈ బాధ్యతలను మండల పరిధిలో స్థానిక తహసీల్దార్లకు అప్పగించింది. వివాహం చేసుకుంటున్న వధువరులు తరుపున హాజరయ్యే 20 మంది వివరాలు, పెళ్

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!

Image
ఆంధ్రప్రదేశ్: ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రజలకు మాస్కు తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ సూచనలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేయబడ్డ ఈ ఉత్తర్వుల్లో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొంటూ, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారితో పాటు ప్రయాణాలు చేసేవారు అన్ని సమయాలలో తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని అన్నారు. అయితే కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు మాస్క్‌ను ధరించడం ఒక అలవాటుగా చేసేలా స్థానిక జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరారు. ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!

2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు: ప్రధాని మోదీ

Image
న్యూఢిల్లీ: ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి వార్షిక సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఐరాస ఎజెండాకు పూర్తి మద్దతు ఇవ్వడంలో భారత్ ముందుటుందని చెప్పుకొచ్చారు, యూఎన్ ఆర్థిక, సామాజిక మండలి మొదటి అధ్యక్షుడు ఒక భారతీయుడేనని ప్రసంగం మొదట్లో అందరికీ గుర్తు చేశారు. అలాగే భరత్ లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు గురించి తెలియచేశారు. ప్రధాని మోడీ ఇచ్చిన ప్రసంగంలో అందరి దృష్టి ఆకర్షించిన ప్రధాన అంశం "అందరికీ ఇల్లు". అలాగే, మా నినాదం 'సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్' - అంటే 'అందరి మద్దతుతో, అందరి అభివృద్ధికి, అందరి నమ్మకంతో' మేము పనిచేస్తున్నామని చెప్పారు. అందరికీ ఇల్లు అనే అంశంపై ప్రసంగిస్తూ, 2020 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా మేము కృషిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మాట్లాడుతూ భరత్ లో కొరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని, రానున్న రోజుల్లో దీనిని ప్ర‌జా ఉద్య‌మంగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే కోవిడ్‌-19 రిక‌వ‌రీ రేట్ల‌లో భార‌త‌దేశం ప్రపంచంలోనే ముందు వరసలో ఉందని ‌మోదీ అన్నారు. అసలై

ఆసుపత్రిలో‌ చేరిన ఐశ్వర్య రాయ్.. ఆందోళనలో బాలీవుడ్

Image
బాలీవుడ్: బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ కుటుంభం కొరోనా వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే జయా బచ్చన్ మినహా మిగిలిన వారికి కరోనా సోకడంతో వారందరూ ఇప్పడు క్వారంటైన్‌‌లోనే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ మొదటి నుంచి ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, కొత్తగా ఇప్పుడు ఐశ్వర్య రాయ్ కూడా ఆసుపత్రిలో చేరారు. తాజా సమాచారం ప్రకారం కరోనా లక్షణాలు ఎక్కువవడంతో ఐశ్వర్యను, కుమార్తె ఆరాధ్యను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని చెప్తున్నారు. అయితే ఈ వార్త ఇటు ఫాన్స్ లోను అటు చిత్ర పరిశ్రమలో ఆందోళన రేకెత్తిస్తుంది. ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్యలకు కూడా కోవిడ్-19 పాజిటివ్

80 లక్షల విలువైన మద్యం రోడ్డు పాలు..!

Image
ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 80 లక్షల రూపాయలు విలువ చేసే 14000 మధ్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే గత నాలుగు నెలలుగా, కృష్ణ జిల్లాల్లో వేరువేరు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్న వారి దగ్గర నుంచి పట్టుబడ్డ మద్యం సీసాలను పోలీసులు మచిలీపట్నంలో నాశనం చేశారు. లాక్ డౌన్ కావడంతో కొంతమంది అక్రమ మార్గంలో వేరే రాష్ట్రాల నుంచి మద్యం సీసాలను తక్కువ ధరకు ఇక్కడికి తరలించి అమ్మడం మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇలా అక్రమార్కులు మద్యాన్ని రాష్ట్రానికి చేరవేస్తున్నారు. ఇలా పట్టుబడిన వారందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే పట్టుబడ్డ మద్యం సీసాలు పెద్ద మొత్తలో ఉండటంతో వాటిని రోడ్ రోలర్‌తో తొక్కించడం జరిగింది. వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని చాలావరకు నియంత్రించడం జరిగింది. అలాగే సీఎం జగన్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా సంపూర్ణ మధ్య నిషేధం త్వరలో చూస్తామని, ఇదొక సంకేతంలా ఉందని చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఈ దృశ్యాలను చూసిన మందు బాబుల హృదయాలు తరుక్కుపోతున్నాయనే చెప్పాలి. ఇంకా చదవండి: 100కు పైగా క

యానాంలో టోర్నడో.. ఆశ్చర్యంలో స్థానికులు..!

Image
పుదుచ్చేరి (యానాం): ఈ రోజు మధ్యాహ్నం భారీ వర్షం మరియు బలమైన గాలి వీస్తుండటంతో యానంలో ఒక చిన్న టోర్నడో జనాలకు కనిపించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలయిన ఒక వీడియోలో ఒక పెద్ద సుడిగాలి (టోర్నడో) నీరును మేఘాల వైపు పైకి లేపుకుంటూ పోవడం చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, సుడిగాలి గోదావరి వెంట కొన్ని రొయ్యల పొలాలను తాకింది. సుడిగాలిని చూసిన స్థానిక ప్రజలు, ఇంతకముందు ఇలాంటివి చూడలేదని పేర్కొన్నారు. నీరు వేగంగా ఆకాశం వైపు వెళ్లడం గమ్మత్తుగా ఉందని అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటివి కొన్ని దేశాల్లో తరచూ సంభవిస్తూ వుంటాయి. కానీ భారతదేశంలో, టోర్నడోలు చాలా అరుదు, ఇది ఖచ్చితంగా తక్కువ తీవ్రతతో కూడిన టోర్నడో అని విశ్లేషకులు అంటున్నారు. Highly unusual phenomenon😳 For the first time probably we are seeing full fledged funnel development of a #Tornado in this part of the world! This deserves some attention & probably a study! @metcentrehyd @ratnakopparthi @IMDWeather @Hosalikar_KS @PIW2020 @WeathrCast https://t.co/tqPA1MC18u — Weather@

100కు పైగా క‌రోనా రోగుల పరారీ.. ఆపై నిరసన..!

Image
అస్సాం : క్వారంటైన్ సెంటర్ నుంచి 100 మంది కరోనా రోగుల ప‌రారీ వార్త గువ‌హ‌టిలోఅందరినీ హడలెత్తిచింది. అయితే వారు పారిపోడానికి కారణం లేకపోలేదు.  క్వారంటైన్ సెంటర్ లో కొరోనా భారీన పడిన రోగులకు స‌రైన సౌకర్యాలు లేవంటూ రోగులు ఆందోళ‌న‌కు దిగారు. ఆపై వారు క్వారంటైన్ సెంట‌ర్ నుంచి పారిపోయి జాతీయ ర‌హ‌దారిపై బైఠాయించి నిరసన తెలిపారు. అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ ఘ‌ట‌న అసోంలోని కామ్‌రూప్ జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా రోగుల వాదన ప్రకారం తమని ఒకే గ‌దిలో 10 నుంచి 12మందిని ఉంచుతున్నార‌ని, కరోనా నియమాలు, భౌతి​క దూరం ఎలా పాటించాలని ప్ర‌శ్నించారు. అలాగే త‌మ‌కు స‌రైన పౌష్టిక ఆహ‌రం ఇవ్వ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారని క‌రోనా రోగులు జాతీయ ర‌హ‌దారిపై నిర‌స‌న చేప‌ట్టడంతో తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్‌ అధికారుల‌తో మాట్లాడి మీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో వారందరు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు. ఈ సంచలన ఘ‌ట‌నపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ క్వారంటైన్ సెంట‌ర్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటే వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే స్వీయ

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

Image
బ్రేకింగ్ న్యూస్ : ప్రజాకవి వరవరరావు ముంబయిలోని తలైజా జైలులో గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వరవరరావుకు మెరుగైన చికిత్స కోసం ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించడం జరిగింది. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది కరోనా లక్షణాలు కనబడడంతో వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదురుగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఎల్గార్ పరిషత్ కేసులో వరవరరావు మరియు మరో తొమ్మిది మంది కార్యకర్తలను పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే, దీనిని మొదట పూణే పోలీసులు విచారించారు మరియు తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ చేశారు. అయితే వరవరరావు సుమారు 22 నెలలు పాటు జైలులోనే వున్నారు. అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందిస్తూ, జైలు శిక్ష అనుభవిస్తున్న కవి, కార్యకర్త వరవరరావును వెంటనే విడుదల చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పంపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇంకా చదవండి: హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌..!

మొదలవనున్న విదేశీ విమాన సర్వీసులు.. వివరాలు ఇవే..

Image
ఢిల్లీ : కోవిడ్-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన స‌ర్వీసులు మెల్లిమెల్లిగా ప్రారంభమవుతున్నాయి. భరత్ విషయానికి వస్తే శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు ఈవారం రెండు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే జర్మనీతో కూడా విమాన సర్వీసుల ప్రారంభంపై సంప్రదింపులు జరిపామని మీడియాముఖంగా తెలియచేశారు. అయితే ఇకపై నిత్యం ఢిల్లీ నుంచి నెవార్క్‌కు విమానాలు వెళ్లనున్నాయి అలాగే ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వారంలో మూడు రోజులు పాటు విమానాలు వెళ్లనున్నాయి. అదే విధంగా యునైటెడ్ ఎయిర్లైన్స్ జులై 17 నుంచి 31 వరకు 18 విమానాలను ఇండియాకు తిప్పనుంది. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఢిల్లీ, బెంగళూరు, ముంబాయిల నుంచి పారిస్‌లకు జూలై 18 నుంచి ఆగస్ట్ 1 వరకు 28 విమానాలను తిప్పనుంది. వీటికి తోడు మరిన్ని విమానసంస్థలు ముందుకు వస్తున్నాయనేది సమాచారం. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ లేనట్లేనా?

హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌..!

Image
తెలంగాణ: హైదరాబాద్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో మొత్తం 15 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. అలాగే హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించబడింది. శ్వేతా మహంతి ఐదు రోజులుగా కార్యాలయానికి రాలేదని, కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని చెప్తున్నారు. అయితే కలెక్టర్‌తో పాటుగా కార్యాలయంలోని డ్రైవర్‌కు, కంప్యూటర్‌ ఆపరేటర్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. మరోవైపు తెలంగాణలో రోజుకు వెయ్యికి పైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అందులోనూ గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఎక్కువ కేసులు నమోదవ్వడం హైదరాబాదు వాసులను హడలెత్రిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై వేలకు చేరువైంది. హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

సుప్రియ సామాజిక సేవకు జోయ్ అలుకాస్ బహుమతిగా ఇల్లు!

Image
కేరళ: కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన ఒక వీడియోలో సుప్రియ అనే ఓ కేరళ యువతి ఒక అంధుడుకి సహాయం చేయడం చూసాం. అయితే సుప్రియ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె పని చేస్తున్న జోయ్ అలుకాస్ కంపెనీవారు ఒక సొంత ఇల్లును బహుమతిగా ఇవ్వడం విశేషం. సుప్రియ ఒక అంధుడుకి సహాయం చేస్తున్న సమయంలో ఎవరో తెలియని వ్యక్తి వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోను కేరళలోని తిరుపత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అయింది. ఆమె అంధుడిపట్ల చూపిన దయకు అందరూ ప్రశంసించారు. అయితే కేరళలోని తిరుపత్తూర్ జిల్లాలోని తిరువల్లుకు చెందిన సుప్రియ జోయ్ అలుకాస్ సంస్థలో ఒక సాధారణ ఉద్యోగం చేస్తుంది. సుప్రియ చాటుకున్న సామాజిక సేవా దృక్పధాన్ని ఫిదా అయినా జోయ్ అలుకాస్ గ్రూప్ ఛైర్మన్ ప్రత్యేక్షంగా వారి ఇంటికి వెళ్లడం జరిగింది. ఆమె ఉంటున్న ఇరుకు ఇల్లును గమనించిన జోయ్ అలుకాస్ చైర్మన్ సుప్రియను ఆశ్చర్యపరిచేలా ఒక కొత్త ఇల్లును బహుమతిగా ఇచ్చారు. నిస్వార్ధంగా సేవ చేసే వారికి ఏదోరకంగా మంచి జరుగుతుందనే దానికి ఇదో ఉదాహరణ. ఇంకా చదవండి: శ్రీ పద్మనాభ స్వామి ఆల

ఒకే కుటుంభలో ఏడుగురికి కరోనా.. అయితే వారు జయించారు!

Image
గుజరాత్ (సూరత్): నాలుగు తరాల కుటుంభం అది, అందులో పదిమంది సభ్యులు, ఏడుగురికి కరోనా పాజిటివ్. అయితే వారు భయపడలేదు, అందరూ కలిసికట్టుగా జయించారు. ఇది సూరత్ లో జరిగిన ఒక ఆదర్శ ఫ్యామిలీ కథ. సామాన్యంగా ఇంట్లో ఒకరికి కరోనా వస్తే తోటివారే దూరానపెట్టే రోజులివి, చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలకు మరింత భయం. ఇలాంటి సంఘటనల గురించి రోజూ వింటూనే వున్నాము. అయితే వీరి కథ కరోనా వస్తే భయపడే వారికి ఆదర్శం కానుంది, భయపడకండి మమ్మల్ని చూడండి, మేము జయించాం అనే ధైర్యాన్నిచ్చే సంకేతాలను పంపుతుంది. వివరాల్లోకి వెళితే సూరత్ లోని ఒక కుటుంభంలో నాలుగు తరాల సభ్యులున్నారు. వారిలో అతిపెద్ద మనిషికి 106 సంవత్సరాలుంటే, అతి చిన్న వాడికి మూడున్నర ఏళ్ళ వయసు. వీరిద్దరితో పాటుగా ఇంకో ఐదుగురు మధ్య వయసు కలిగినవారికి కరోనా సోకింది. మిగిలిన ముగ్గురుకి కరోనా రాకపోవడంతో ముందు జాగ్రత్తగా వారి బంధువులింటికి పంపారు. అయితే ఆ ఏడుగురి కుటుంభసభ్యులలో 106 ఏళ్ళ ముసలాయనికి, మూడున్నరేళ్ల పిల్లాడికి అసలు కరోనా వచ్చిందనే తెలియదు. ఈ  ఏడుగురు కొన్ని రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లోనే తమ 3bhk ఫ్లాట్‌లోనే వున్నారు. అయితే వారు ఎప్పటికప్పుడు ఐసోలేషన్ జాగ్రత్

బిల్ గేట్స్, ఒబామా, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్

Image
టెక్నాలజీ: రాజకీయ నాయకులు, టెక్ దిగ్గజ కంపెనీల ప్రముఖులు, ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులు అలాగే పెద్ద కంపెనీల ట్విట్టర్ ఖాతాల్లోకి గుర్తు తెలియని హ్యాకర్లు బుధవారం ప్రవేశించారు. ఈ జాబితాలో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ ఫ్రంట్-రన్నర్ జో బిడెన్, మైక్ బ్లూమ్‌బెర్గ్, అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ వంటి అనేక మంది టెక్ బిలియనీర్ల ఖాతాలు వున్నాయి. వీరి ట్విట్టర్ ఖాతాలలోకి ప్రవేశించిన హ్యాకర్లు ఆ అకౌంట్ కలిగివున్న వ్యక్తి పెట్టినట్లుగా ఒక ట్వీట్ చేశారు. ఉదాహరణకు, ఒబామా అకౌంట్ ద్వారా చేసిన ట్వీట్ ఇలా వుంది. "ఈ కోవిడ్-19 కారణంగా నేను నా ప్రజలకు తిరిగి ఇస్తున్నాను, మీరు కూడా క్రింది బిట్ కాయిన్ అడ్రసుకు ఇవ్వండి, తిరిగి మీ ఖాతాలోకి డబుల్ అమౌంట్ వస్తుంది, మీరు 1000 డాలర్లు ఇస్తే 2000 డాలర్లు తిరిగి మీ ఖాతాకు వస్తాయి, ఈ అవకాశం 30 నిమిషాల వరకు మాత్రమే ". ఇలా హ్యాకర్స్ వారి ట్విట్టర్ అనుచరులను అనామక బిట్‌కాయిన్ ఖాతాకు డబ్బు పంపించాలని ట్వీట్ చేయడం జరిగింది.  వెంటనే ట్విట్టర్ నకిలీ ట్వీట్లు అన్నీ తొల

భూ రికార్డుల తారుమారు కేసులో తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ అరెస్ట్

Image
ఆంధ్రప్రదేశ్ (అమరావతి): రాజధాని అమరావతి గ్రామాల పరిధిలోని భూ రికార్డుల తారుమారు కేసులో తుళ్లూరు మాజీ తహసీల్దార్‌ సుధీర్‌ బాబును పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనతో పాటుగా దళితులు సాగు చేసుకుంటున్న అసైన్డ్‌ భూములను నిభందనలు విరుద్దంగా తక్కువ రేటుకు కొనుగోలు చేసిన గుమ్మడి సురేషును కూడా అరెస్ట్ చేశారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుమ్మడి సురేషుకు మాజీ తహసీల్దార్‌ సుధీరు బాబు సహకరించిటం జరిగింది. మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన వీరిద్దరినీ 14 రోజుల పాటు రిమాండుతో గుంటూరు సబ్‌ జైలుకు తరలించారు. అసలు భూ రికార్డుల తారుమారు ఎలా జరిగింది? రాజధాని నిర్మాణం పేరిట గత ప్రభుత్వం 29 గ్రామాల పరిధిలో 33 వేల ఎకరాలను సేకరించిన సంగతి తెలిసిందే. తుళ్లూరు మండలం రాయపూడిలోని పెదలంకలో సర్వే నంబర్‌ 376/2ఎలో 3.70 ఎకరాలను 1975లో నాటి ప్రభుత్వం అసైన్డ్‌ ల్యాండ్‌ కింద ఎస్సీలకు పంపిణీ చేసింది గత ప్రభుత్వ హయాంలో తహసీల్దార్‌గా పనిచేసిన సుధీర్‌ బాబు ఈ అసైన్డ్‌ భూమిని పట్టా భూమిగా మార్పు చేసి ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌ ల్యాండ్‌లోకి ఎక్కించారు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుమ్మడి సురేష్‌  అందులో 86 సెంట్ల భూమిని కొను

పెన్షన్‌ని అందుకుంటున్న మహిళలకు కూడా ‘వైఎస్సార్ చేయూత’

Image
ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళుతుందనే చెప్పాలి. పైగా అర్హులు వారి అర్హతల విషయంలో బాగా సానుకూలంగా ఆలోచిస్తుంది. అందరూ లభ్ధి పొందేలా నిర్ణయాలు తీసుకొంటుందన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ‘వైఎస్సార్ చేయూత’ పథకం మొదలు పెట్టిన ప్రభుత్వం మొదట్లో దీనికి పెన్షన్ తీసుకునేవారు అనర్హులు అని ప్రకటించింది. అయితే జగన్‌ తాజా నిర్ణయం ప్రకారం పెంషన్ తీసుకునే వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్య్సకార మహిళలకు కూడా ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందనున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తన నిర్ణయాన్ని తెలిపారు. ఈ నిర్ణయం వలన దాదాపుగా 8.21 లక్షల మందికి పైగా మహిళలకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందించనున్నారు. ఆగస్టు 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఆదేశా

ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా?

Image
ఆంధ్రప్రదేశ్ : ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుకు నడుం బిగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో అభివృధ్ది ప‌రుగులు పెడుతుందని, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుందని అన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గించడం వల్ల ఉపాయగాలు ఏంటి? తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కలెక్టర్లు బాగా పరిపాలన చేయగలగడానికి వీలవుతుంది. ఒకే జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలుంటే జిల్లా కేంద్రానికి కొన్ని నియోజకవర్గాలు దూరమవుతాయి అలాగే పరిపాలనా సౌలభ్యం తగ్గుందని ఒక అంచనా. ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ నివేదిక పూర్తవగానే 2021 లో అధికారికంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది. ఇంకా చదవండి: ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !! బ్రేకింగ్ న్యూస్: ఏపీ ఎంసెట్ వాయిదా

భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రి లోపలకి వర్షపు నీరు

Image
తెలంగాణ : హైదరాబాద్‌ ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో భారీ వర్షం కారణంగా మురుగు నీరు లోపలకి చేరింది. బుధవారం మధ్యాహ్నం నాడు కురిసిన వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్‌ చాంబర్‌ సహా రోగుల వార్డులలోకి నీరు చేరింది. అయితే ఇలా ఆస్పత్రి లోపలకి వర్షపు నీరు ముంచెత్తడంతో వార్డుల్లో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నీరు ఏకంగా రోగుల యొక్క బెడ్డుల వరకు రావడంతో ఆసుపత్రి సిబ్బంది కంగుతిన్నారు. వార్డులలోని బెడ్డుల దగ్గరకే కాకుండా కొన్ని చాంబర్స్ లోపలకి కూడా నీరు చేరింది. శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో తరచూ పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడలకు పగుళ్లు రావడంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు లోపలలకి చేరుతుంది. అలాగే చుట్టుప్రక్కల ప్రదేశాలలో మురుగు నీటి వ్యవస్థ దెబ్బతినడంతో వర్షానికి ఆస్పత్రి ఆవరణలోని పలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. దీనితో వర్షపు నీటికి మురుగు నీరు తోడై ఇటు రోగులను అటు డాక్టర్లను ఇబ్బందికి గురిచేసింది. లాభంలేక కొంతమంది రోగులైతే వస్తున్న నీటికి పరుపులను అడ్డుపెట్టి బయటికి తోడటం జరిగింది. ఏమిచేయలేను వారు అలాగే ఉండిపోయారు. ఏదేమైనా ప్రభుత్వం రోగులకు ఇబ్బంది కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్ర

సాక్షిలో బిత్తిరి సత్తి: వీడియో వైరల్

Image
సోషల్ మీడియా వైరల్:  V6 టీవీ తీన్మార్ వార్తలు ద్వారా ప్రజాదారణ పొందిన బిత్తిరి సత్తి ఈమధ్యనే TV 9లో చేరారు. ఏమైందో ఏమో మళ్ళీ ఇప్పుడు తన జాగా సాక్షీ టీవీకి మార్చారు. బిత్తిరి బిత్తిరి తన మాటలతో జనాన్ని చాలాకాలం నుంచి మెప్పిస్తూ వస్తున్నారు. V6 టీవీలోని బిత్తిరి సత్తి తీన్మార్ వార్తలు జనాలు ఇంకా చూస్తుంటారు. అంతగా ఫాలోయింగ్ పెంచుకున్నారు బిత్తిరి సత్తి. TV 9లో చేరిన కొద్ది కాలానికే ఆయన సాక్షి టీవీకి మారడం జరిగింది. అయితే కొత్తగా సాక్షి టీవీలో చేరిన బిత్తిరి సత్తికి యాజమాన్యం బాగానే స్వాగతం పలికింది. అలాగే తన పరిచయ వీడియోని ఒకటి రిలీజ్ చేసింది. ఇకపై శాశ్వతంగా సాక్షీకే అంకితం అన్నట్టు వీడియో ఒకటి రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సాక్షి సంస్థ తండ్రిని గౌరవించుకునే జాగా అని ఇక నీకు తిరుగుండదని, తండ్రి వేషంలోని బిత్తిరి సత్తి, బిత్తిరి సత్తికే చెప్పడం ఈ వీడియో ప్రత్యేకత. అయితే ఇదే తండ్రి క్యారెక్టర్ ను రాబోయే సాక్షి ప్రోగ్రాంలో ఉంచుతారో లేదో చూడాలి. ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !!

12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ ఒకే చోట: జియో టీవీ+

Image
టెక్నాలజీ: రిలయన్స్ జియో ఈ రోజు రిలయన్స్ 43 వ ఎజిఎం సమావేశం సందర్భంగా కొన్ని ప్రకటనలు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా జియో మీట్, జియో 5జి, జియో గ్లాస్ మరియు జియో టీవీ+ లను అధికారికంగా ప్రకటించింది. వీటిలో జియో టీవీ+ అత్యంత ప్రతిష్టాత్మకమైనది, దీని ద్వారా ఇక జియో సెటప్ బాక్స్ కస్టమర్లు ఒకే అకౌంట్ తో 12 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వీక్షించడానికి అవకాశం పొందుతారు. జియో టీవీ ప్లస్ ద్వారా 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల నుండి సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు ఇతర కంటెంట్‌లను చూడవచ్చు. ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, వూట్, సోనీ లైవ్, జీ 5, లయన్స్‌గేట్ ప్లే, జియో సినిమా, జియో సావన్, యూట్యూబ్, షెమరూ మరియు ఈరోస్ నౌ యొక్క కంటెంట్ ఈ ఒక్క జియో టివి + నుండి లభిస్తుంది. అంటే జియో టీవీ+ ద్వారా మీరు వివిధ OTT లకు మారకుండా, అన్నింటి సేవలను ఒకే చోట పొందవచ్చు. మీకు ఇష్టమైన సినిమా లేదా వెబ్ సిరీస్ సెర్చ్ చేయడం ద్వారా ఇది అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఫలితాలను ఇస్తుంది, తద్వారా మీరు ఏ కంటెంట్ ఎక్కడవుందో తెలుసుకోవలసిన పనిలేదు. పైగా సెర్చ్ చేయడానికి వ్యక్తిగత శోధన

త్వరలో 5జీ సేవలు: రిలయన్స్‌ జియో

Image
టెక్నాలజీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యొక్క 43వ వార్షిక సమావేశం లాక్ డౌన్ కారణంగా బుధవారం వర్చువల్ పద్దతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ, రిలయన్స్ జియో‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్‌ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని, ఇక కన్జ్యూమర్‌ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందని వివరించారు. భారత్‌లో జియో సొంతంగా 5జీని అభివృద్ధి చేసిందని ముకేశ్‌ అంబానీ వెల్లడించారు. అలాగే 5జీ ద్వారా ప్రపంచ స్థాయి సేవలను భారత్‌ అందిపుచ్చుకుంటుందని అన్నారు. అయితే జియో 5జీ సేవలు 2021లో అందుబాటులోకి రావచ్చని, త్వరలోనే ఈ 5జీ సేవలను త్వరలో భారత్‌లో పరీక్షిస్తామని వివరించారు. ప్రపంచ ఆర్ధిక రంగంలోనే అతి పెద్ద డీల్,  ఫేస్‌బుక్ సంస్థ జియోలో రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే, త్వరలో గూగుల్ కూడా మరో పెద్ద పెట్టుబడి (7.7శాతం వాటా కోసం అనగా రూ.33,737 కోట్ల పెట్టుబడి) రిలయన్స్ జియోలో పెట్టనుందని వెల్లడించారు. మీమధ్య జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సమావేశంలో గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్ ప్రసంగిస్తూ రాబోయే ఐదేళ్లలో గూగుల్ భారత్‌లో రూ.75,000 కోట్ల (అంటే 1000 కోట్ల డాలర్ల) పెట్టు

చంద్రబాబుకు సంచయిత గజపతిరాజు కౌంటర్!

Image
ఆంధ్రప్రదేశ్: పద్మనాభస్వామి గుడి భాద్యతలను రాజవంశీలకు చందేలా సుప్రీమ్ కోర్ట్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ఉద్దేశించి ట్విట్టర్ లో కామెంట్ చేసిన చంద్రబాబు నాయుడు దానిని సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డుతో ముడిపెట్టడం గమనార్హం. వీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యోక్యం చేసుకోవటం మానాలని చంద్రబాబు అన్నారు. అయితే సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డులకు చైర్‌పర్సన్‌ గా వున్న సంచయిత గజపతిరాజు కౌంటర్‌ ఇచ్చారు. సంచయిత గజపతిరాజు ట్విట్టర్ ద్వారా, నేను గజపతి వంశానికి చట్టబద్ధ వారసుడైన ఆనంద గజపతికి తాను వారసురాలినన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలన్నారు. మా చిన్నాన్న అశోక్‌ గజపతిరాజులా చంద్రబాబు లింగ వివక్ష చూపరని భావిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే తమ కుటుంబ వ్యవహారాలలో జ్యోక్యం తగదని, రాజకీయం చేయడం మానుకోవాలని చంద్రబాబుకు కౌంటర్‌ ఇచ్చారు. అసలు చంద్రబాబు ఏమన్నారు: AP ప్రభుత్వం సుప్రీమ్ కోర్ట్ తీర్పును గమనించాలి మరియు సింహాచలం బోర్డు & మాన్సాస్ ట్రస్ట్ యొక్క నిర్వాహణలో జోక్యం చేసుకోవడం మానేయాలి. సంరక్షకులుగా గజపత

సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ ట్రైలర్..?

Image
టాలీవుడ్: తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది. చివరిగా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి, 2018 జనవరిలో విడుదలయింది. జనసేన పార్టీని బలపరిచే ద్యేయం మీద వున్న పవన్ కళ్యాణ్ ఈమధ్యన మూడు చిత్రాలు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. పింక్ సినిమాను వకీల్ సాబ్ గా తెలుగులో తీసుకొస్తున్న పవర్ స్టార్ అదేవిదంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతున్న మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ రెండు చిత్రాల షూటింగ్ లాక్ డౌన్ కు ముందే మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం వకీల్ సాబ్ షూటింగ్ పార్ట్ దాదాపుగా ముగించుకుంది. ఇటీవల విడుదలయిన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. దసరా కానుకగా రావాల్సిన వకీల్ సాబ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడే అవకాశాలు మెరుగ్గా వున్నాయి. దీనితో మెగా ఫాన్స్ ఆశలు ఇప్పుడే తీరేలాలేదు. సినిమా వున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏదోలా తమ అభిమాన హీరో గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా #AdvanceHDBPawankalyan అనే ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రేండింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న 49వ పుట్టినరోజు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటిను

బాలకృష్ణ బోయపాటి సినిమాలో కెజిఎఫ్ విలన్!

Image
టాలీవుడ్: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే అది నందమూరి అభిమానులకు పండగే. పక్కా మాస్ దర్శకుడు ఒక పక్కా మాస్ హీరోతో సినిమా తీస్తున్నాడంటే ఎవరికి చూడాలని వుండదు చెప్పండి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో వస్తున్న మూడవ సినిమా BB3పై చాలా అంచనాలు ఉండటం సహజం. ఎందుకంటే అంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు మరి అంతటి ఘనవిజయం సాధించాయి. అయితే ఈ సినిమాలోని కొన్ని పాత్రల కోసం ఇప్పటికీ అన్వేషణ జరుగుతూనే వుంది. కొన్ని రోజులకు ముందు అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ చేస్తున్నాడని వినికిడి. మొదట్లో సంజయ్ దత్ ఈ సినిమాలో చేయడానికి నిరాకరించాడని, బాలకృష్ణ మాట్లాడంతో ఒప్పుకున్నాడని తెలుస్తుంది. సంజయ్ దత్ త్వరలో కెజిఎఫ్ సినిమా ద్వారా అధీరా పాత్రలో మనముందుకు రానున్నాడు. కెజిఎఫ్ ఒక ప్యాన్ ఇండియా సినిమా కానీ BB3 మాత్రం ఒక ప్రాంతీయ భాషా సినిమా. మామూలుగా చూస్తే ఒక పెద్ద బాలీవుడ్ నటుడు ప్రాంతీయ సినిమాలలో చేయడానికి ఇష్టపడడు. అయితే బాలయ్

అసలైన అయోధ్య నేపాల్ లో వుంది, శ్రీరాముడు మావాడు: కేపీ శర్మ ఓలీ

Image
జాతీయం: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మరోసారి భరత్ పై తన అక్కసు చూపించారు, తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. అసలైన అయోధ్యా నగరం నేపాల్ లో ఉందని, శ్రీరాముడు ఇక్కడి నేపాల్ లోని అయోధ్యలో జన్మించాడని ,భారత్ సాంస్కృతిక దోపిడీ చేస్తుందని విమర్శించారు. కేపీ శర్మ ఓలీ తన నివాసంలో జరిగిన కవి భానుభక్త్ జన్మదిన వేడుకల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వేడుకలలో ఓలీ మాట్లాడుతూ “అసలు అయోధ్య నేపాల్ బీర్‌గంజ్ జిల్లా థొరీ తీరంలో ఉందని చెప్పుకొచ్చారు. శ్రీరాముడు అక్కడే జన్మించాడు” అని కేపీ శర్మ ఓలీ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను సదరు నేపాల్ రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ నేత కమల్ థాపా ఖండించారు. కమల్ థాపా, ట్విట్టర్ వేదికగా, " ఓలీ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం తగదు. చూస్తుంటే, ఉద్రిక్తతలు తగ్గించడానికి బదులు, ఆయన భారత్-నేపాల్ సంబంధాలను చెడగొట్టాలని సంకల్పించుకున్నట్లున్నారు" అన్నారు. అదేవిదంగా వివిధ నాయకులు, ప్రజలు సోషల్ మీడియాలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ పై సైటైర్లు వేస్తున్నారు. వైరల్ అవుతున్న ఆర్జీవీ పవర్ స్టార్ సినిమా పోస్టర్లు

హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

Image
తెలంగాణ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బయోటెక్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డీజీసీఏ భారత్ బయోటెక్‌కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. ఇప్పటికే జంతువులపై కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) కూడా ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్‌లో అధికారులు క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 14 నుంచి నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ మొదలుపెట్టనున్నారు. కొంతమంది వాలంటీర్ల బ్లడ్‌ శాంపిల్స్‌ను సేకరించిన వైద్యులు వాటిని సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చేసిన 12 కేంద్రాల్లో సుమారుగా 375 మందిపై ఈ కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ యొక్క మొదట

నంద్యాలలో జులై 25 వరకు లాక్‌డౌన్‌

Image
ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించటం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జులై 15 నుండి 25 వరకు అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. అయితే ప్రజలు నిత్యావసర సరుకులు కోసం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే రిటైల్‌ కూరగాయల అమ్మకాలకు కూడా ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే. జులై 25 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. నిత్యావసర సరుకులు కొనడానికి బయటకి వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు నంద్యాల ప్రజానీకానికి తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

ఆహా అనేలా లాక్‌డౌన్‌ ను ఉపయోగించుకున్న అల్లు అరవింద్!

Image
టాలీవుడ్: ఇండియాలో మొట్టమొదటిసారి ఒక ప్రాంతీయ భాషకు ప్రత్యేకంగా "ఆహా" అనే డిజిటల్ ప్లాట్‌ఫాం నెలకొల్పిన అల్లు అరవింద్, ఇందులో తెలుగు కంటెంట్ మాత్రమే ఉంటుందని తెలియచేశారు. అయితే తెలుగుకు ప్రత్యేకం అవ్వటం వల్ల వీక్షకుల సంఖ్య తగ్గుతుందని, ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్, జీ 5 లాంటి వరల్డ్ వైడ్ ఓటీటీ వేదికలకు పోటీ ఇవ్వలేదని చాలా మంది అనుకున్నారు. దీనిని నిజం చేస్తూ ఆహాలో కూడా మొదట్లో పెద్ద సినిమాలంటూ వచ్చేవి కాదు. అయితే చిన్న బడ్జెట్ సినిమాలు, తెలుగు వెబ్ సిరీస్ మీద ఎక్కువుగా దృష్టిసారించిన అల్లు అరవింద్, వాటిని క్రమక్రమంగా పెంచుకుంటూ వచ్చారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి ఓటీటీలలో ఏమి దొరకదో దానిపై ఎక్కువగా ఫోకస్ చేశారు. తెలుగుకే ప్రత్యేకంగా కొన్ని వెబ్ సిరీస్ లను ఒకటి తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ పోయారు. అతి తక్కువ సమయంలో ఆహాలో సక్సెస్ అయినన్ని తెలుగు వెబ్ సిరీస్ లేదా ఆహా ఒరిజినల్స్ ఇంకే ఓటీటీ వేదికలలో లేవనే చెప్పాలి. మస్తీస్, లాక్డ్, సిన్, కొత్త పోరాడు వంటి తెలుగు వెబ్ సిరీస్ మరియు ఒరిజినల్స్ వీక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి మూడు నెలల్ల

డోనాల్డ్ ట్రంప్ ట్విట్చ్ సస్పెన్షన్ ఎత్రివేత

Image
సోషల్ మీడియా:  రెడ్డిట్ మరియు ట్విచ్ సోషల్ మీడియా కంపెనీలు రాజకీయపరమైన విషయాలను నిషేదిస్తున్నామని ప్రకటించి రెండు వారాలు దాటింది. అయితే డోనాల్డ్ ట్రంప్ చేసిన వివాదాస్పద వాక్యాలు కారణంగా అతని యొక్క అకౌంట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు గతంలో ట్విట్చ్ ప్రకటించింది. అయితే ఇప్పుడు తిరిగి ట్రంప్ అకౌంట్ పై సస్పెన్షన్ ఎత్రివేసింది. ట్విట్చ్ అనేది ఒక వీడియో లైవ్ స్ట్రీమింగ్ సర్వీస్. ట్విట్చ్ ఛానల్ యొక్క సేవలను ఉపయోగించుకోవటం ద్వారా కొంతమంది ఆన్లైన్ లో ప్రసంగాలు ఇస్తుంటారు. డోనాల్డ్ ట్రంప్ కూడా కొన్ని రోజుల క్రితం రాజకీయపరమైన ప్రసంగం ఒకటి స్ట్రీమ్ చేయటం జరిగింది. ఆ లైవ్ స్ట్రీమ్ లో ట్రంప్ మాట్లాడిన మాటలు ద్వేషపూరితమైనవని ట్విట్చ్ అతని అకౌంట్ ను రెండు వారాల పాటు సస్పెండ్ చేసింది. అసలు ట్రంప్ ఏమన్నారు:  ట్రంప్ ఒకానొక సమయంలో తన ట్విట్చ్ వీడియో స్ట్రీమ్ ద్వారా మెక్సికన్ వలసదారులను ఉద్దేశించి ద్వేషపూరిత పదజాలం ఉపయోగించారు. అసలు విషయం ఏంటంటే, ట్విట్చ్ అనే ఈ సోషల్ మీడియా వేదికలో ద్వేషపూరిత ప్రవర్తన మరియు పదజాలం అనుమతించబడదు. అందుకనే వారి విధానాలకు అనుగుణంగా, స్ట్రీమ్‌లో అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల కార