100కు పైగా కరోనా రోగుల పరారీ.. ఆపై నిరసన..!
అస్సాం: క్వారంటైన్ సెంటర్ నుంచి 100 మంది కరోనా రోగుల పరారీ వార్త గువహటిలోఅందరినీ హడలెత్తిచింది. అయితే వారు పారిపోడానికి కారణం లేకపోలేదు. క్వారంటైన్ సెంటర్ లో కొరోనా భారీన పడిన రోగులకు సరైన సౌకర్యాలు లేవంటూ రోగులు ఆందోళనకు దిగారు. ఆపై వారు క్వారంటైన్ సెంటర్ నుంచి పారిపోయి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ఈ ఘటన అసోంలోని కామ్రూప్ జిల్లాలో చోటుచేసుకుంది. కరోనా రోగుల వాదన ప్రకారం తమని ఒకే గదిలో 10 నుంచి 12మందిని ఉంచుతున్నారని, కరోనా నియమాలు, భౌతిక దూరం ఎలా పాటించాలని ప్రశ్నించారు. అలాగే తమకు సరైన పౌష్టిక ఆహరం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కరోనా రోగులు జాతీయ రహదారిపై నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ కైలాష్ కార్తీక్ అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారందరు తిరిగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లారు.
ఈ సంచలన ఘటనపై అస్సాం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత భిశ్వ శర్మ మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లో ఇబ్బందులు ఎదుర్కొంటే వ్యాధిగ్రస్తులు ఇంట్లోనే స్వీయ నిర్భందంలో ఉండొచ్చని తెలిపారు. ఏదేమైనా సాధ్యమైనంత త్వరగా క్వారంటైన్ సెంటర్ లో సౌకర్యాల లేమి లేకుండా చూసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అందరూ సహకరించాలని కోరారు. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్..!

Comments
Post a comment