నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: వీడియో గేమ్‌లో గెలిస్తే 1,000 నెలులు ఫ్రీ
టెక్నాలజీ/గేమింగ్: ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎవరైతే వీడియో గేమ్‌లో అత్యధిక స్కోర్ చేస్తారో వారికి 1000 నెలలు అనగా 83 సంవత్సరాల ఉచిత నెట్‌ఫ్లిక్స్ సేవలను అందించనుంది. అయితే ఉచిత సేవలను పొందాలంటే వినియోగదారులు ‘ద ఓల్డ్ గార్డ్’ అనే మినీ వీడియా గేమ్‌లో అత్యధిక స్కోర్ చేయవలసి ఉంటుంది, గేమ్ ఆడటానికి నెట్‌ఫ్లిక్స్ ఖాతా అవసరం లేదు. ‘ద ఓల్డ్ గార్డ్’, చార్లిజ్ థేరోనే నటించిన నెట్‌ఫ్లిక్స్ సినిమా. ఇది ఈమధ్యనే (జులై 10న) రిలీజయ్యి సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. అయితే ఇదే పేరుతో నెట్‌ఫ్లిక్స్ కొత్త వీడియో గేమ్ తీసుకువచ్చింది.

ఈ వీడియో గేమ్ ఆడి అత్యధిక స్కోర్ సాధించిన వారికి 83 సంవత్సరాలు లేదా 1,000 నెలల నెట్‌ఫ్లిక్స్ ఉచిత సేవలను పొందవచ్చు. అయితే ఈ వీడియో గేమ్‌ను మూడు రోజుల పాటు అంటే జులై 17 నుంచి జులై 19వరకు ఆడే వినియోగదారులను ఈ ఉచిత సేవల ఆఫర్ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది. దీనికోసం ఒక వెబ్సైటును కూడా రూపొందించింది. అయితే ఈ గేమ్ 50 యునైటెడ్ స్టేట్స్ మరియు డి.సి. యొక్క చట్టబద్ధమైన నివాసులకు మాత్రమే. అంటే ప్రస్తుతానికి ఈ ఆఫర్ ఇతర దేశాలకు వర్తించదు. ఈ అర్హత తెలుసుకున్న తరువాత చాలామంది వీడియో గేమ్ ప్రియులు ఇండియాకు కూడా వర్తింపచేయమని కోరుతున్నారు. (12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ ఒకే చోట: జియో టీవీ+)

Comments
Post a comment