ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్‌వేర్‌: వెంటనే తొలిగించిన గూగుల్

గూగుల్ ప్లే స్టోర్ లో యాప్స్ డౌన్లోడ్ చేసిన తరువాత దానికి కావలసిన పర్మిషన్స్ మనం ఇస్తూ ఉంటాం. పర్మిషన్స్ తీసుకున్న యాప్ మన యొక్క డేటాని చూడటానికి అవకాశం లేకపోలేదు. అయితే ఆ యాప్ కంపెనీలు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాల్సివుంది. అందులో మరీ ముక్యమైనది యాప్ వినియోగదారుల డేటా సెక్యూరిటీ. కానీ గతంలో కొన్ని కంపెనీలు ఈ నియమాలను అనుసరించ లేదు. దీనికి తోడు మాల్వేర్ వైరస్, కొన్ని యాప్స్ ద్వారా ఫోన్స్ లోకి ప్రేవిసించి మీ విలువైన సమాచారాన్ని తస్కరించే అవకాశం వుంది. అలాంటి యాప్స్ ను గూగుల్ ప్లే స్టోర్ ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది.

google-removes-11-apps-play-store

గూగుల్ ప్లే స్టోర్ వినియోదారుడి సెక్యూరిటీ దృష్ట్యా ఇప్పటి వరకు చాలా యాప్స్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. కొత్తగా మరో 11 యాప్స్ ను తొలగించి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా తనిఖీల్లో భాగంగా 11 గూగుల్ ప్లే స్టోర్ ఆండ్రాయిడ్ యాప్స్ లో జోకర్ మాల్‌వేర్‌ అనే వైరస్‌ను గూగుల్ గుర్తించింది. ఆ తరువాత వెంటనే తమ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. చైనా నిషేధిత యాప్‌ కంపెనీలకు భారత్ 79 సూటి ప్రశ్నలు

ఆ 11 యాప్స్ పేర్లు ఇలా వున్నాయి

 1. ఇమేజ్ కంప్రెస్ ఆండ్రాయిడ్

 2. కాంటాక్ట్

 3. విత్ మీ టెక్ట్స్

 4. హెచ్ఎంవాయిస్ ఫ్రెండ్ ఎస్ఎంఎస్

 5. రిలాక్స్ రిలాక్సేషన్ ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్

 6. చెర్రీ మెసేజ్ సెండ్ఎస్ఎంఎస్

 7. పిజన్ లవింగ్ లవ్ మెసేజ్

 8. ఫైల్ రికవర్ ఫైల్స్

 9. ఎల్ ప్లకార్ లాక్అప్స్

 10. రిమైండ్ మీ అలారం

 11. ట్రైనింగ్ మెమరీ గేమ్

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!