12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ ఒకే చోట: జియో టీవీ+

టెక్నాలజీ: రిలయన్స్ జియో ఈ రోజు రిలయన్స్ 43 వ ఎజిఎం సమావేశం సందర్భంగా కొన్ని ప్రకటనలు చేసింది. ఈ కార్యక్రమం ద్వారా జియో మీట్, జియో 5జి, జియో గ్లాస్ మరియు జియో టీవీ+ లను అధికారికంగా ప్రకటించింది. వీటిలో జియో టీవీ+ అత్యంత ప్రతిష్టాత్మకమైనది, దీని ద్వారా ఇక జియో సెటప్ బాక్స్ కస్టమర్లు ఒకే అకౌంట్ తో 12 ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు వీక్షించడానికి అవకాశం పొందుతారు.

jio-tv-plus-with-12-ott-platforms-content-you-can-watch-all-digital-content-at-one-place

జియో టీవీ ప్లస్ ద్వారా 12 ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల నుండి సినిమాలు, టీవీ కార్యక్రమాలు మరియు ఇతర కంటెంట్‌లను చూడవచ్చు. ప్రముఖ ఓటీటీ సంస్థలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్, వూట్, సోనీ లైవ్, జీ 5, లయన్స్‌గేట్ ప్లే, జియో సినిమా, జియో సావన్, యూట్యూబ్, షెమరూ మరియు ఈరోస్ నౌ యొక్క కంటెంట్ ఈ ఒక్క జియో టివి + నుండి లభిస్తుంది.

అంటే జియో టీవీ+ ద్వారా మీరు వివిధ OTT లకు మారకుండా, అన్నింటి సేవలను ఒకే చోట పొందవచ్చు. మీకు ఇష్టమైన సినిమా లేదా వెబ్ సిరీస్ సెర్చ్ చేయడం ద్వారా ఇది అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఫలితాలను ఇస్తుంది, తద్వారా మీరు ఏ కంటెంట్ ఎక్కడవుందో తెలుసుకోవలసిన పనిలేదు. పైగా సెర్చ్ చేయడానికి వ్యక్తిగత శోధన ఎంపికతో పాటు టెక్స్ట్ మరియు వాయిస్ సెర్చ్ ఫీచర్ కలిగి వుండటం విశేషం. అలాగే జియో టీవీ+ ఇంటరాక్టివ్ లైవ్ టీవీ ఫీచర్ ద్వారా మీరు సాధారణంగా టీవీ చూసే అనుభవాన్ని కూడా మార్చేస్తుంది.

ఇంకా: త్వరలో 5జీ సేవలు: రిలయన్స్‌ జియో

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!