ఆర్‌జివి పవర్ స్టార్ టికెట్ ధర 150.. బ్లాక్‌లో 250..!

టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ ఏంచేసినా వినూత్నంగా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో ఆయన రిలీజ్ చేసిన నగ్నం, క్లైమాక్స్ సినిమాలు పేలవంగా ఒక షార్ట్ ఫిలింను తలపించేలా ఉండటంవల్ల చాలా మందికి నచ్చలేదు. కానీ అవి డబ్బులు మాత్రం రాబట్టాయి. దీనికి కారణం పే పేర వ్యూ, అంటే ఆన్లైన్ లో ఆర్‌జివి సినిమా చుసిన ప్రతిసారి డబ్బు చెల్లించి చూడాల్సిందే. దీనివల్ల సినిమా ఎలావున్నా ప్రొడ్యూసర్లకు డబ్బు గిడుతుంది. అయితే ఈ పే పేర వ్యూ ప్రక్రియ మాత్రం పెద్ద సినిమాలకు రానున్న రోజుల్లో బాగా ఉపయోగబడుతుందనే చెప్పాలి.

rgv-power-star-ticket-price-150-250-in-black

ఇక విషయానికొస్తే ఆర్‌జివి తన సొంతంగా ఒక వెబ్ అప్లికేషన్ నిర్మించుకున్నారు. దీనికి "ఆర్‌జివి వరల్డ్ థియేటర్" అని పేరుపెట్టుకున్నారు. తాను తీయబోయే సినిమాలన్నీ ఈ ఆర్‌జివి వరల్డ్ థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చారు. దీనిలో మొట్టమొదటగా రిలీజ్ చేసే సినిమా "పవర్ స్టార్" అని, దీనిని జులై 25న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ సినిమా చూడాలంటే టికెట్ ధర 150 గా నియమించారు. కానీ ఈ ధర కేవలం ఆరోజు 11 గంటల సమయం లోపు కొనిన వారికి మాత్రమే, ఏవేరైతే 11 గంటలు దాటి టికెట్ కొంటారో వారు తప్పనిసరిగా బ్లాక్లో 250 పెట్టి కొనుక్కోవాలని చెప్పారు.

అలాగే "ఆర్‌జివి వరల్డ్ థియేటర్" రాబోయే సినిమా/ ట్రైలర్ చూడాలనుకునే వారికి నాలుగు రకాలుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.

  1. ట్రైలర్ చూడటానికి ట్రెయిలర్ బుకింగ్

  2. సినిమా చూడటానికి అడ్వాన్స్ బుకింగ్

  3. బ్లాక్ బుకింగ్ (సినిమా రిలీజ్ అయ్యాక)

  4. కరెంట్ బుకింగ్ (ఖర్చు తగ్గినప్పుడు, కొన్ని రోజుల తరువాత)


ఆర్‌జివి పోకడలు గమనిస్తున్న ఓటీటీ దిగ్గజాలు ముక్కున్న వేలేసుకుంటుంటే, టాలీవుడ్ మాత్రం ఏంచేయాలో తెలియక నిశితంగా గమనిస్తూవుంది. తాజా అంచనాల ప్రకారం థియేటర్స్ ఈ సంవత్సరం తెరుచుకునే వీలు కనబడట్లేదు. అందుకే టాలీవుడ్, ఈ ప్రక్రియగాని హిట్ అయితే తమ సినిమాలకు కూడా వర్తించే అవకాశాలు లేకపోలేదు, అయితే ఇన్ని రకాల బుకింగ్స్ ఉండకపోవచ్చు. (ఆహా అనేలా లాక్‌డౌన్‌ ను ఉపయోగించుకున్న అల్లు అరవింద్!)

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!