తిరుమల కొండపై 170కు పైగా కరోనా పాజిటివ్ కేసులు..!

తిరుపతి: ప్రస్తుతం దేశంలో ఎక్కడ చుసినా కరోనా కలవరమే. దేవుడా కరోనాను తొందరగా మానుంచి దూరం చేయమని గుడికెళ్ళి మొక్కుకుందాం అనుకున్నా గుడిలో అర్చకులను కూడా కరోనా వదల్లేదు! తిరుమలపై కొండపై 21 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ వచ్చిందన్న విషయం తెలిసిందే, అలాగే ఇతర సిబ్బందిలో కూడా కొరోనా లక్షణాలు కనిపించడంతో తిరుమల తిరుపతి వాసులు భయపడుతున్నారు.

more-than-170-corona-positive-cases-on-tirumala-turupati-hill

తిరుమల దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రసాద తయారీ కేంద్రాలలో పనిచేసే సిబ్బంది, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని విభాగాల్లో 170కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే మరికొంతమందికి కరోనా లక్షణాలున్నాయనే వార్తలతో అధికారులు వారి రక్త నమూనాలను సేకరించారు.

తాజాగా మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాసమూర్తి దీక్షితులు కొరోనా వళ్ళ మరణించారన్న వార్త అక్కడి వారిని కలవరానికి గురిచేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అనుబంధ ఆలయాలలోని వ్యక్తులకు కూడా కరోనా సాకోడంతో కలకలం రేగింది. దీనితో టీటీడీ అనుబంధ ఆలయాలను ఈరోజు నుంచి మూసివేయడం జరిగింది, అయితే తిరుపతిలో దర్శనాల నిలిపివేతపై టిటిడి బోర్డు ప్రభుత్వానికి నివేదిక పంపగా, ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. అయితే తిరుపతిలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది, ఇది 10 నుంచి 15 రోజులపాటు ఉంటుందని అంచనా..!

ఇంకా చదవండి: శ్రీవెంకటేశ్వరస్వామికి అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్ల విరాళం

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!