ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్యలకు కూడా కోవిడ్-19 పాజిటివ్

ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కూడా కోవిడ్-19 పాజిటివ్: అమితాబ్, అభిషేక్ బచ్చన్ కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షలు చేయించుకుని నిన్న సాయంత్రం నగర ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం రెండోసారి టెస్ట్ చేసిన తరువాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు కుమార్తె ఆరాధ్య కూడా కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని తేలింది, అయితే అమితాబ్ భార్య జయ బచ్చన్ కు నెగటివ్. అయితే ఈ విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

aishwarya-rai-bachchan-and-aaradhya-also-test-positive-for-covid-19

అమితాబ్ బచ్చన్ కు కొరోనా పాజిటివ్ అని తేలిన తరువాత, అతని బంగ్లా "జల్సా" ప్రాంగణాన్ని శుభ్రపరచడానికి BMC శాంటిసేషన్ కార్మికులు శుభ్రపరిచారు. అలాగే నోటీసులు కూడా అంటించటం జరిగింది.

కేంద్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ట్విట్టర్లో "శ్రీమతి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మరియు కుమార్తె ఆరాధ్య అభిషేక్ బచ్చన్ కూడా కోవిడ్ 19 కు పాజిటివ్ ఉన్నట్లు తెలిపారు. బచ్చన్ కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేసారు.

అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తనకు పాజిటివ్ వచ్చిన విషయం చెప్పటం జరిగింది. తరువాత అభిషేక్ కూడా ఇలా పోస్ట్ చేసాడు, “ఈ రోజు, నేను నా తండ్రి ఇద్దరూ COVID-19 కు పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలతో మేమిద్దరమూ ఆసుపత్రిలో వున్నాము. మా కుటుంబం మరియు సిబ్బంది అందరూ పరీక్షించబడుతున్నారు. అందరూ భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు."

ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్యకు కూడా పాజిటివ్ రావటంతో బచ్చన్ అభిమానులలో భయం నెలకొంది.

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!