సెప్టెంబర్ 2న వకీల్ సాబ్ ట్రైలర్..?

టాలీవుడ్: తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది. చివరిగా వచ్చిన సినిమా అజ్ఞాతవాసి, 2018 జనవరిలో విడుదలయింది. జనసేన పార్టీని బలపరిచే ద్యేయం మీద వున్న పవన్ కళ్యాణ్ ఈమధ్యన మూడు చిత్రాలు కూడా అంగీకరించిన విషయం తెలిసిందే. పింక్ సినిమాను వకీల్ సాబ్ గా తెలుగులో తీసుకొస్తున్న పవర్ స్టార్ అదేవిదంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతున్న మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. అయితే ఈ రెండు చిత్రాల షూటింగ్ లాక్ డౌన్ కు ముందే మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం వకీల్ సాబ్ షూటింగ్ పార్ట్ దాదాపుగా ముగించుకుంది. ఇటీవల విడుదలయిన పోస్టర్లు, లిరికల్ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది.

vakeel-saab-trailer-on-september-2nd

దసరా కానుకగా రావాల్సిన వకీల్ సాబ్ లాక్ డౌన్ కారణంగా వాయిదాపడే అవకాశాలు మెరుగ్గా వున్నాయి. దీనితో మెగా ఫాన్స్ ఆశలు ఇప్పుడే తీరేలాలేదు. సినిమా వున్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఏదోలా తమ అభిమాన హీరో గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తుంటారు. తాజాగా ట్విట్టర్ వేదికగా #AdvanceHDBPawankalyan అనే ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రేండింగ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న 49వ పుట్టినరోజు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కోసం ఇప్పటినుంచే ట్వీట్స్ మొదలుపెట్టారు. ఈ లాక్ డౌన్ లో మెగా ఫాన్స్ ఆశ తీరేలా మరి సెప్టెంబర్ 2న ట్రైలర్ విడుదల చేస్తారో లేదో చూడాలి!

ఆకాశం నీ హద్దురా! ట్రైలర్ విడుదల ఆ రోజేనా?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!