తిరుమల: శ్రీవెంకటేశ్వరస్వామికి అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్ల విరాళం

తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి చాలా మంది విరాళాలు ఇస్తుంటారు. అయితే కొంతమంది అధికారికంగా ఇస్తే మరికొంతమంది ఎవరికీ తెలియకుండా విరాళం ఇస్తారు. వివరాల్లోకి వెళితే తాజాగా ఒక అజ్ఞాత భక్తుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి హుండీలో ఏకంగా 20 బంగార బిస్కెట్లు వేసి తన స్వామి భక్తిని తెలియజేశారు. ఈ ఒక్కొక్క బంగారు బిస్కెట్టు 100 గ్రాములు ఉందని బోర్డు తెలిపింది. అంటే 2000 గ్రామములు (2 కేజీలు) అనమాట.

tirumala-venkateswara-swamy-devotee-donates-20-gold-biscuits

ఈ విరాళం విలువ బయట మార్కెట్ రేట్ లో 64 లక్షలు పైమాటే. అయితే ఈ విషయం హుండీ లెక్కింపు సమయంలో వెలుగు చూసింది. ఇలా భారీగా విరాళాలు ఇచ్చే అజ్ఞాత భక్తులు శ్రీవెంకటేశ్వరస్వామికి చాలామందే వున్నారు.

కాగా, టీటీడీ ఆస్తులపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. అలాగే రానున్న బ్రహ్మోత్సవాలకు టెండర్లు పిలిచామని ఈవో వెల్లడించారు. తిరుమల హుండీ ఆదాయాన్నికి సంబంధించి జూన్‌ 11 నుంచి జూలై 10 వరకు ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని ఈవో తెలిపారు. అలాగే భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో 7కోట్లు రూపాయల ఆదాయం అదనంగా వచ్చిందని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!