గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 2020: లైవ్ లోకి సుందర్ పిచై

గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 2020: టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌ను సోమవారం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇతర టెక్ ఈవెంట్‌ల మాదిరిగానే ఆన్‌లైన్‌లో హోస్ట్ చేయబడుతుంది. గత సంవత్సరం, గూగుల్ బెంగళూరులో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ల్యాబ్, బిఎస్ఎన్ఎల్ భాగస్వామ్యం, వ్యాపారుల కోసం గూగుల్ పే ఫర్ బిజినెస్ యాప్ మరియు గూగుల్ అసిస్టెంట్, డిస్కవర్, లెన్స్ మరియు బోలో వంటి కొత్త డిజిటల్ వేదికలను భారతీయల కోసం తీసుకువచ్చింది. గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం అధునాతన డిజిటల్ ప్రొడక్ట్స్ ద్వారా ఇంటర్నెట్‌ను ఇండియాలో మరింత ప్రాప్యత చేసేలా చేయటం.

google-for-india-2020-annual-event-sundar-pichai

భారత ప్రభుత్వం యొక్క కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, రవిశంకర్ ప్రసాద్, గూగుల్ సిఇఒ సుందర్ పిచై మరియు ఇతర నాయకులు ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. భారతదేశం యొక్క డిజిటల్ అవసరాలు మరియు డిజిటల్ ఎకానమీ యొక్క ప్రయోజనాలను ఇందులో చర్చించబోతున్నారు.

అయితే ప్రతి సంవత్సరం గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ జరుగుతుంది, ఇక్కడ దేశంలోని వినియోగదారుల కోసం ఉత్పత్తుల ప్రకటన జరుగుతుంది. ఈ సంవత్సరం జరగబోయే గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ ఆరవ ఎడిషన్ కాగా ప్రతి సంవత్సరం మాదిరిగానే, గూగుల్ తన భారతీయ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఉత్పత్తులను విడుదల చేస్తుంది.

గూగుల్ ఫర్ ఇండియా 2020 కార్యక్రమం జూలై 13 న జరుగుతుందని గూగుల్ ఇండియా ఆహ్వానం ప్రకారం మీడియాకు పంపింది. ఈ కార్యక్రమం సోమవారం మధ్యాహ్నం 2:00 గంటలకు గూగుల్ ఇండియా యూట్యూబ్ ఛానెల్‌లో లైవ్ ప్రసారం అందుబాటులోకి వస్తుంది. ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్‌వేర్‌: వెంటనే తొలిగించిన గూగుల్

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!