ప్రభాస్ 21వ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్, హీరోయిన్ దీపికా పదుకొనే...!

టాలీవుడ్: ప్రభాస్ 21వ చిత్రంలో దీపికా పదుకొనేని హీరోయిన్ పాత్ర కోసం తీసుకున్నట్టు వైజయంతి మూవీస్ అధికారికంగా ధ్రువీకరించింది. మరోవైపు వస్తున్న వార్త ఏంటంటే ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా. తెలుగులో సైన్స్ ఫిక్షన్ సినిమాలు చాలా అరుదు. అయితే అడపా దడపా ఇతర భాషల్లో తీస్తుంటారు కానీ అవి జనాలను ఎక్కువగా ఆకట్టుకోలేదు. దీనికి కారణం బడ్జెట్, అవును ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా తియ్యాలంటే పెద్ద బడ్జెట్ తప్పనిసరి. ఇందువల్లే చాలా మంది ఈ జానర్ లో సినిమాలు తీయడానికి ముందుకురారు. అయితే మహానటి సినిమా తరువాత మళ్ళీ ఊపు మీదున్న వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరక్కించనుంది. అలాగే ఈ సినిమా వైజయంతి మూవీస్ యొక్క ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా.

Read: OTT Movies List

వైజయంతి మూవీస్ యొక్క ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో దీనిని ఇండియాతో పాటు ఇతర దేశ భాషల్లో కూడా రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావిస్తుంది. నాగ్ అశ్విన్ మహానటి లాంటి వరల్డ్ క్లాస్ బయోగ్రఫీ సినిమా తరువాత తీసుకువస్తున్న కథ చాలా కొత్తగా ఉంటుందని, ఇప్పటివరకు ఇండియాలో రాని ఒక సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ ఇందులో ఉంటుందని అంటున్నారు.

తెలుగులో వచ్చిన భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే మనకు గుర్తొచ్చేది బాలయ్య నటించిన ఆదిత్య 369, రజినీకాంత్ రోబోట్, అదే విధంగా సూర్య నటించిన 24, ఇవే తెలుగులో భారీ హిట్లు నమోదు చేసుకున్నాయి. ఈ సినిమా వాటిని మించి హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!