ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !!

ఆంధ్రప్రదేశ్: సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో ఏపీ ప్రభుత్వం పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఈ చర్చలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయనం జరుగనుంది. వీలైనంత త్వరగా అధ్యయన నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కమిటీ సభ్యులను కోరారు.

ఈ కమిటీలో సీసీఎల్‌ఏ కమిషనర్, జీఏడీ సర్వీసుల సెక్రటరీ, ప్లానింగ్‌ విభాగం సెక్రటరీ, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రతినిధి, కన్వీనర్‌గా ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కీలక సభ్యులుగా వుంటారు.

25-new-districts-in-andhra-pradesh-list

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా నిర్ణయంతో 13 జిల్లాలుగా వున్న రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించి 25 జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ చర్చలో 26వ జిల్లా గురించి ప్రస్తావన కూడా వచ్చింది. డిప్యూటీ సీఎం పీసుస్ఫ శ్రీవాణి మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కానున్న అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని అన్నారు. ఆమె మాట్లాడుతూ 4 జిల్లాలకు అరకు జిల్లా ప్రాంతం విస్తరించి ఉందని సీఎం దృష్ఠ్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాల మేరకు అరకును రెండు జిల్లాలు చేయగలమా లేదా అనే విషయంపై అధ్యయనం చేయనున్నారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజాధానులు బిల్లును ఆమోదించింది. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా మారనున్నాయి. అయితే ఈ తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు 25 జిల్లాలుగా విస్తరించనుంది.

కొత్త జిల్లాలు ఇవేనా..

ఎన్నికల ప్రచార సమయంలో జగన్ మోహన్ రెడ్డి ఏ జిల్లాలను పునర్వ్యవస్థీకరించినున్నారో తెలియచేశారు. అయితే వాటిలో మార్పు ఉండకపోవచ్చు.

 1. అరకు

 2. అనకాపల్లి

 3. నరసాపురం

 4. అమలాపురం

 5. రాజమండ్రి

 6. నరసరావుపేట

 7. బాపట్ల

 8. రాజంపేట

 9. తిరుపతి

 10. నంద్యాల

 11. హిందూపూర్

 12. విజయవాడ


ఇప్పటికే వున్న 13 జిల్లాలకు కొత్తగా ఏర్పడే ఈ 12 జిల్లాలను జతచేసి 25 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించినున్నారు.

ఆ 4 జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువ.. జాగ్రత్త సుమా!

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!