నంద్యాలలో జులై 25 వరకు లాక్‌డౌన్‌

ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా నంద్యాలలో 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించటం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రోజురోజుకి కరోనా వైరస్ వ్యాప్తి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. జులై 15 నుండి 25 వరకు అత్యవసర సర్వీసులకు మాత్రమే సడలింపు ఇచ్చారు. అయితే ప్రజలు నిత్యావసర సరుకులు కోసం ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే రిటైల్‌ కూరగాయల అమ్మకాలకు కూడా ఆరు గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే.

10-days-lockdown-in-nandyala

జులై 25 వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంటుంది. నిత్యావసర సరుకులు కొనడానికి బయటకి వచ్చే ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అధికారులు నంద్యాల ప్రజానీకానికి తెలియజేశారు. ఆంధ్ర ప్రదేశ్ వార్తలు

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!