జులై 25న తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ ఫలితాలు..!

తెలంగాణ: రాష్ట్ర ఇంటర్ రీవెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ ఫలితాలను ఈనెల 25న ప్రకటించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు భావిస్తోంది. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు జవాబు పత్రాల రీవెరిఫికేషన్‌ కోసం దాదాపు 60 వేలు, మార్కుల రీ కౌంటింగ్‌ కోసం 15 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో స్టాఫ్ తగ్గడంతో ఇంటర్‌ రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌ ఫలితాల విషయంలో జాప్యం జరిగింది. మరోవైపు తెలంగాణలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షల్లో తప్పిన విద్యార్థులను పాస్‌ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరకీ తెలిసిందే.

telangana-inter-re-verification-and-recounting-results-on-25th

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!