తెలంగాణ ఇంటర్ సిలబస్ 30% కుదింపు!

తెలంగాణ ఇంటర్ సిలబస్ 30% కుదింపు! కరోనా వైరస్ లాక్ డౌన్ నేపధ్యంలో దేశంలో వున్న అన్ని స్కూళ్ళు, కాలేజీలు మూత బడ్డాయి. దీని వల్ల చివరి నిమిషంలో చాలా పరీక్షలు రద్దవ్వటం చూసాం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే స్కూళ్ళు, కాలేజీలు తెరవడానికి మరికొంత సమయం పట్టొచ్చు. అయితే ఎదో ఒక సమయంలో మొదలయినా మొత్తం సిలబస్ పూర్తి చేయటం కష్టం. అందుకే తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంది.

తొమ్మిది నుంచి 12వ తరగతుల వరకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 30 శాతం సిలబస్ కుదించిన విషయం తెలిసిందే. ఇదే తీరును అనుసరిస్తూ తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రణాళికలు సిద్దంచేస్తోందని తెలుస్తుంది. సీబీఎస్ఈ ఎలా అయితే 30 శాతం సిలబస్‌ను కుదించిందో అలాగే రాష్ట్రంలోనూ ఆ మేరకు చర్యలు తీసుకోవాలని తెలంగాఅం ప్రభుత్వం నిర్ణయించింది.

telangana-inter-board-to-reduce-syllabus-30-percent-like-cbse

ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని సిలబస్ సీబీఎస్ఈలో, రాష్ట్రంలో ఒకే తరహాలో ఉంటుంది. కాబట్టి ఆయా ఇంటర్ గ్రూపుల్లో సీబీఎస్ఈ తొలగించే పాఠ్యాంశాలను తెలంగాణ రాష్ట్రంలోనూ తొలగించాలని ఇంటర్ బోర్డు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా తొలగించాల్సిన పాఠాలపై ఇంటర్ బోర్డు నిపుణులు కసరత్తు ప్రారంభించారు. అయితే ఆర్ట్స్ గ్రూపుల్లో ఏ సిలబస్‌ను తగ్గించాలన్న దానిపై ఇంకా ఒక కొలిక్కి రాలేదు. దీనికి సంబంధించి కసరత్తు చేయనున్నారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!