ఆ 4 జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువ.. జాగ్రత్త సుమా!

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కొద్దిరోజులుగా ఏపీలో వరుసగా రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజుకి 1500 పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో రోజుకు 25 వేలకు పైగా కేసులు నమోదు అవుతుంటే, మన రాష్ట్రం నుంచి దాదాపు 6 శాతం ప్రజలు కరోనా భారీన పడుతున్నారు. ఈ సంఖ్య మరికొన్ని రోజుల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.

corona-positive-cases-raises-in-ap

ప్రస్తుత అంచనాల ప్రకారం రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 25 వేలు దాటింది. ఇందులో కరోనా మరణాల సంఖ్య 292 కి చేరింది. మరో వైపు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి చెరిచిన విషయం తెలిసిందే. (ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!)

ఆ జిల్లాలు చూస్తే అనంతపురం(2850), కర్నూలు(2939), గుంటూరు(2799), తూర్పుగోదావరి(2231)లలో ఎక్కువ పాజిటివ్ కేసులు ఉండగా. ఈ జిల్లాల్లో లొక్డౌన్ ఆంక్షలు కఠినతరం చేయనుంది ప్రభుత్వం. మీరు గనుక ఆయా జిల్లాలోకి వెళితే కొంచం జాగ్రత్త తప్పనిసరి.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!