ఏపీలో 5 వేలకు పైగా తాజా కేసులు: 24 గంటల్లో ఇదే అతి పెద్ద సంఖ్య

ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో వైరస్ తీవ్రత ఎలా వుందని తెలుసుకోవాలంటే రోజురోజుకూ పెరుగుతున్న ఈ కేసుల సంఖ్యను గమనిస్తే చాలు. ప్రశుతం ఆంధ్రప్రదేశ్ లో వైరస్ యొక్క తీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. అయితే నిన్నమొన్నటి వరకు 3 వేలు దాటని ఈ కేసులు ఏకంగా ఇప్పడు 5 వేలకు పైగా నమోదయ్యాయి, 24 గంటల్లో నమోదయిన కేసుల్లో ఇదే అతి పెద్ద సంఖ్య. అలాగే గడిచిన 24 గంటల్లో ఏకంగా 56 మరణాలు సంభవించడం ఆంధ్రప్రదేశ్ లోని పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

more-than-5000-latest-cases-in-ap-the-largest-number-in-24-hours

ఇప్పటి వరకు ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 642కు చేరింది. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49650 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య 26118గా ఉండగా మరోవైపు 22890 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు 642 మంది మరణించారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో 1000 కేసులు దాటడం వైరస్ తీవ్రతకు అద్దంపడుతోంది.

ఇంకా చదవండి: పరోటా కోసం క్వారంటైన్ సెంట‌ర్ నుంచి బయటకొచ్చిన వైరస్ బాధితుడు..!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!