త్వరలో 5జీ సేవలు: రిలయన్స్ జియో
టెక్నాలజీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 43వ వార్షిక సమావేశం లాక్ డౌన్ కారణంగా బుధవారం వర్చువల్ పద్దతిలో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, రిలయన్స్ జియోలో 7.7శాతం వాటా కోసం గూగుల్ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని, ఇక కన్జ్యూమర్ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందని వివరించారు.

భారత్లో జియో సొంతంగా 5జీని అభివృద్ధి చేసిందని ముకేశ్ అంబానీ వెల్లడించారు. అలాగే 5జీ ద్వారా ప్రపంచ స్థాయి సేవలను భారత్ అందిపుచ్చుకుంటుందని అన్నారు. అయితే జియో 5జీ సేవలు 2021లో అందుబాటులోకి రావచ్చని, త్వరలోనే ఈ 5జీ సేవలను త్వరలో భారత్లో పరీక్షిస్తామని వివరించారు.
ప్రపంచ ఆర్ధిక రంగంలోనే అతి పెద్ద డీల్, ఫేస్బుక్ సంస్థ జియోలో రూ.1.58 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే, త్వరలో గూగుల్ కూడా మరో పెద్ద పెట్టుబడి (7.7శాతం వాటా కోసం అనగా రూ.33,737 కోట్ల పెట్టుబడి) రిలయన్స్ జియోలో పెట్టనుందని వెల్లడించారు.
మీమధ్య జరిగిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగిస్తూ రాబోయే ఐదేళ్లలో గూగుల్ భారత్లో రూ.75,000 కోట్ల (అంటే 1000 కోట్ల డాలర్ల) పెట్టుబడులు పెడుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

Comments
Post a comment