ప్రతి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జిల్లా?

ఆంధ్రప్రదేశ్: ప‌రిపాల‌న సౌల‌భ్యం కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుకు నడుం బిగించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతూ కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో అభివృధ్ది ప‌రుగులు పెడుతుందని, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో పూర్తి పార‌ద‌ర్శ‌క‌త ఉంటుందని అన్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రతి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలో ఎలాంటి మార్పులకు అవకాశం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం.

every-district-in-ap-will-have-7-assembly-constituencies

అసెంబ్లీ నియోజకవర్గాలు తగ్గించడం వల్ల ఉపాయగాలు ఏంటి?

తక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా ఏర్పడితే అందరికీ సౌలభ్యంగా ఉంటుంది. కలెక్టర్లు బాగా పరిపాలన చేయగలగడానికి వీలవుతుంది. ఒకే జిల్లాలో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలుంటే జిల్లా కేంద్రానికి కొన్ని నియోజకవర్గాలు దూరమవుతాయి అలాగే పరిపాలనా సౌలభ్యం తగ్గుందని ఒక అంచనా.

ఈ కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ నివేదిక పూర్తవగానే 2021 లో అధికారికంగా 12 కొత్త జిల్లాల ఏర్పాటు జరగనుంది.

ఇంకా చదవండి:

ఏపీలో ఇక 25 జిల్లాలు 3 రాజధానులు.. !!

బ్రేకింగ్ న్యూస్: ఏపీ ఎంసెట్ వాయిదా

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!