భారత్లో 75000 కోట్ల పెట్టుబడులకు గూగుల్ సిద్ధం: సుందర్ పిచై
టెక్నాలజీ/ ఇంటర్నెట్: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. తాజా సమాచారం ప్రకారం రాబోయే 5 నుంచి 7 సంవత్సరాల్లో భారత్లో 75,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచై గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ ద్వారా ప్రకటించారు. ఈ పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీ, భాగస్వామ్యాలు, నిర్వహణ వంటి వివిధ రూపాల్లో సమకూరుస్తామని స్పష్టం చేశారు.

భారత్ భవితవ్యం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై తమకున్న మక్కువను ఈ భారీ పెట్టుబడులే నిదర్శనమని అన్నారు. భారత డిజిటలీకరణలో కీలకమైన నాలుగు రంగాల్లో ఈ పెట్టుబడులు దృష్టిసారిస్తాయని సుందర్ పిచై స్పష్టం చేశారు.
గూగుల్ ఫర్ ఇండియా వర్చ్యువల్ ఈవెంట్ ముఖ్య అంశాలు:
గూగుల్ సీఈఓ సుందర్ పిచై మాట్లాడుతూ భారత దేశంలోని ప్రతి వ్యక్తికి తన సొంత భాషలో సమాచారాన్ని చేరవేయడం ముఖ్యమని ప్రస్తావించారు, రానున్న రోజుల్లో దీనిని మరింత ముందుకు తీసుకువెళ్తామని తెలియచేశారు.
ఈ ఈవెంట్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఇలా అన్నారు,
ఈ ఉదయం, సుందర్ పిచైతో పరస్పర చర్చ జరిగింది. మేము విస్తృతమైన విషయాలపై మాట్లాడాము, ముఖ్యంగా భారతదేశపు రైతులు, యువకులు మరియు పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చడానికి సాంకేతిక శక్తిని పెంచడం పట్ల చర్చ జరిగింది.
అలాగే విద్య, అభ్యాసం, డిజిటల్ చెల్లింపులను పెంచడం మరియు మరెన్నోరంగాలలో గూగుల్ చేసిన కృషిని గురించి మరింత తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్వేర్: వెంటనే తొలిగించిన గూగుల్

- భారత్ అవసరాలకు కావలసిన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, పరిశ్రమలు డిజిటల్ బాట పట్టేలా వాటికి సహకరించడం, సామాజిక ప్రయోజనాలకు వైద్య, విద్యం, సేద్యం వంటి రంగాల్లో ఆటోమేషన్ ఇంటెలిజెన్స్ అమలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడులను పెడుతున్నామని పేర్కొన్నారు
- సుందర్ పిచై మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్ ఆన్లైన్ వేదికలో భారత్ గొప్ప పురోగతి సాధించిందని ప్రశంసించారు. డిజిటల్ కనెక్టివిటీకి లోతైన పునాదులు నిర్మించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు
- అతి తక్కువ ధరలకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం వల్ల మరియు డేటా ధరల తగ్గింపు వల్ల, అంతర్జాతీయ స్ధాయిలో నూతన అవకాశాలకు అవకాశం ఏర్పడిందని అన్నారు
ఈ ఈవెంట్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ఇలా అన్నారు,
ఈ ఉదయం, సుందర్ పిచైతో పరస్పర చర్చ జరిగింది. మేము విస్తృతమైన విషయాలపై మాట్లాడాము, ముఖ్యంగా భారతదేశపు రైతులు, యువకులు మరియు పారిశ్రామికవేత్తల జీవితాలను మార్చడానికి సాంకేతిక శక్తిని పెంచడం పట్ల చర్చ జరిగింది.
అలాగే విద్య, అభ్యాసం, డిజిటల్ చెల్లింపులను పెంచడం మరియు మరెన్నోరంగాలలో గూగుల్ చేసిన కృషిని గురించి మరింత తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
ఈ 11 యాప్స్ లో జోకర్ మాల్వేర్: వెంటనే తొలిగించిన గూగుల్
Comments
Post a comment