చైనా నిషేధిత యాప్‌ కంపెనీలకు భారత్ 79 సూటి ప్రశ్నలు

డేటా గోప్యతకు సంబంధించి భారత ప్రభుత్వం ఇటీవల నిషేధించిన చైనా యాప్ కంపెనీలకు 79 ప్రశ్నలు సంధించింది. ఈ నిషేధించబడిన యాప్ కంపెనీలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MEITY) నోటీసు మరియు 79 ప్రశ్నల జాబితాను పంపింది. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఆయా కంపెనీలకు మంత్రిత్వ శాఖ మూడు వారాలు సమయం ఇచ్చింది. అలాగే ఈ నిషేధిత యాప్ కంపెనీలు జూలై 22 లోగా స్పందించకపోతే, వాటిపై విధించిన నిషేధం శాశ్వతంగా మారుతుందని నోటీసులో పేర్కొంది.

indian-govt-sends-79-questions-to-chinese-banned-companies

మరోవైపు తమ యాప్ ను నిషేదించటం అన్యాయమని ట్రూ కాలర్ పేర్కొంది. అలాగే కొంతమంది టిక్ టాక్ ప్రియులు చాలా నిరాశలో వున్నారని తెలుస్తోంది. ఇంటర్నెట్ వేదికగా కొంత మంది టిక్ టోకర్స్ తమ యొక్క నిరుత్సాహాన్ని తెలియచేస్తున్నారు.

భారత ప్రభుత్వం స్పందించిన ప్రశ్నల పరంపర చూస్తే అవి ఎక్కువగా వినియోగదారుల డేటా సెక్యూరిటీ గురించే ఉన్నాయని తెలుస్తోంది. అందులో కొన్ని ప్రశ్నలు ఇలా వున్నాయి.

  • మీ సంస్థలకు ఫండింగ్‌ ఎక్కడి నుంచి వస్తుంది?

  • మీ సర్వర్ల లొకేషన్ మరియు అవి ఎక్కడ నుంచి పని చేస్తాయి?

  • స్మార్ట్ ఫోన్ లోని వినియోగదారుడి డేటాకి మీరు ఎటువంటి భరోసా కలిపిస్తారు?

  • అలాగే డేటా మేనేజ్‌మెంట్‌, వాటి మాతృసంస్థలకు సంబంధించిన వివరాలు వంటి పలు ప్రశ్నలు ఉన్నాయి.


ఈ 79 ప్రశ్నలకు సంబంధించి సదరు కంపెనీలు ప్రభుత్వానికి సరైన సమయంలో సమాధానం ఇవ్వగలిగితే మళ్లీ ఈ యాప్‌లు భారత్‌లో పనిచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కంపెనీలు పంపే సమాధానాలను బట్టి కమిటీ పర్యవేక్షించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

ఇక్కడ వున్న అసలైన మలుపు ఏమిటంటే యాప్‌ల పనితీరుపై ఇండియన్‌ ఇంటెలిజన్స్‌ ఏజన్సీలు, గ్లోబల్‌ సైబర్‌ వాచ్‌ డాగ్‌లు కూడా భారత ప్రభుత్వానికి రిపోర్టులను ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో చైనా కంపెనీలు ఇచ్చే ఆ సమాధానాలు ఈ ఏజన్సీలు ఇచ్చే రిపోర్టుతో సరిపోవాలి. అప్పుడే నిషేధం ఎత్తివేసే అవకాశం వుంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!