80 లక్షల విలువైన మద్యం రోడ్డు పాలు..!

ఆంధ్రప్రదేశ్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 80 లక్షల రూపాయలు విలువ చేసే 14000 మధ్యం సీసాలను రోడ్ రోలర్‌తో తొక్కించారు పోలీసులు. వివరాల్లోకి వెళితే గత నాలుగు నెలలుగా, కృష్ణ జిల్లాల్లో వేరువేరు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం తెచ్చి అమ్ముతున్న వారి దగ్గర నుంచి పట్టుబడ్డ మద్యం సీసాలను పోలీసులు మచిలీపట్నంలో నాశనం చేశారు.

liquor-bottles-destroyed-in-krishna-machilipatnam

లాక్ డౌన్ కావడంతో కొంతమంది అక్రమ మార్గంలో వేరే రాష్ట్రాల నుంచి మద్యం సీసాలను తక్కువ ధరకు ఇక్కడికి తరలించి అమ్మడం మొదలుపెట్టారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఇలా అక్రమార్కులు మద్యాన్ని రాష్ట్రానికి చేరవేస్తున్నారు. ఇలా పట్టుబడిన వారందరినీ పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే పట్టుబడ్డ మద్యం సీసాలు పెద్ద మొత్తలో ఉండటంతో వాటిని రోడ్ రోలర్‌తో తొక్కించడం జరిగింది.

వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మద్యాన్ని చాలావరకు నియంత్రించడం జరిగింది. అలాగే సీఎం జగన్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా సంపూర్ణ మధ్య నిషేధం త్వరలో చూస్తామని, ఇదొక సంకేతంలా ఉందని చాలా మంది అనుకుంటున్నారు.

అయితే ఈ దృశ్యాలను చూసిన మందు బాబుల హృదయాలు తరుక్కుపోతున్నాయనే చెప్పాలి.

ఇంకా చదవండి: 100కు పైగా క‌రోనా రోగుల పరారీ.. ఆపై నిరసన..!

Comments

Popular posts from this blog

ఎన్-95 మాస్కులు వద్దు.. సాధారణ మాస్కులు వాడండి..!

టిక్‌టాక్ రికార్డును బద్దలు కొట్టిన జూమ్ యాప్..!

రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!