యానాంలో టోర్నడో.. ఆశ్చర్యంలో స్థానికులు..!

పుదుచ్చేరి (యానాం): ఈ రోజు మధ్యాహ్నం భారీ వర్షం మరియు బలమైన గాలి వీస్తుండటంతో యానంలో ఒక చిన్న టోర్నడో జనాలకు కనిపించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరలయిన ఒక వీడియోలో ఒక పెద్ద సుడిగాలి (టోర్నడో) నీరును మేఘాల వైపు పైకి లేపుకుంటూ పోవడం చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

tornado-in-yanam-puducherry-going-viral

స్థానికుల అభిప్రాయం ప్రకారం, సుడిగాలి గోదావరి వెంట కొన్ని రొయ్యల పొలాలను తాకింది. సుడిగాలిని చూసిన స్థానిక ప్రజలు, ఇంతకముందు ఇలాంటివి చూడలేదని పేర్కొన్నారు. నీరు వేగంగా ఆకాశం వైపు వెళ్లడం గమ్మత్తుగా ఉందని అక్కడి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇలాంటివి కొన్ని దేశాల్లో తరచూ సంభవిస్తూ వుంటాయి. కానీ భారతదేశంలో, టోర్నడోలు చాలా అరుదు, ఇది ఖచ్చితంగా తక్కువ తీవ్రతతో కూడిన టోర్నడో అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ లేనట్లేనా?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!