పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో.. అదే మర్చిపోయారే!

తెలంగాణ (కామారెడ్డి): ‘పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో’ అని ప్రభుత్వం అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేసినా కొంతమంది మాత్రం ఎందుకో మారడం లేదు. కరోనా వైరస్ సోకిన బాధితులకు భరోసా ఇవ్వాల్సింది పోయి కొంతమంది మూర్ఖులు వారిని మరింత క్రుంగ తీస్తున్నారు.

no-humanity-on-corona-patient-in-telangana-kamareddy

కామారెడ్డిలోని హౌసింగ్‌బోర్డు కాలనీ వాసులు కోవిడ్-19 పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పట్ల కఠినంగా వ్యవహరించిన ఘటన వెలుగుచూసింది. వ్యాధి సోకిన వ్యక్తికి టిఫిన్‌ పెట్టేందుకు వచ్చిన వ్యక్తిపై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించారు. కాలనీవాసుల యొక్క వింత ప్రవర్తనతో కుంగిపోయిన బాధితుడు ఇల్లు మారటం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే కరోనా పాజిటివ్‌ వచ్చిన ఒక వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉన్నాడు. కరోనా బాధితులు ఎండకు ఉండాలని వైద్యులు సూచించారు, దీంతో అతను హౌసింగ్‌బోర్డు కాలనీలోని తన సొంత మామయ్య ఇంటికి రాగా, అక్కడి కాలనీ వాసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది నచ్చజెప్పడంతో మొదట్లో ఆందోళన విరమించారు. కానీ, వ్యాధి సోకిన వ్యక్తికి మరుసటి రోజు టిఫిన్‌ పెట్టేందుకు వచ్చిన మరో వ్యక్తిని తిడుతూ కొందరు రాళ్లు పట్టుకుని కొట్టేందుకు సిద్ధమయ్యారు.

విషయం తెలుసుకున్న అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్, పట్టణ ఎస్సై తదితరులు అక్కడకు చేరుకున్నారు. అయితే వాళ్ళ ముందే కాలనీవాసులు బాధితుడ్ని తిట్టడం చూసి అధికారులే విస్తుపోయారు. దీంతో కుంగిపోయిన బాధితుడు తాను ఇక్కడ ఉండలేనని వేరే ఇంటికి మారిపోయాడు. ఇలా చాలామంది మూర్ఖులు పోరాడాల్సింది రోగితో కాదు.. వ్యాధితో.. అనే ప్రాథమిక సూత్రాన్నే మర్చిపోతున్నారు.

ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!