బాలకృష్ణ బోయపాటి సినిమాలో కెజిఎఫ్ విలన్!

టాలీవుడ్: బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వచ్చిందంటే అది నందమూరి అభిమానులకు పండగే. పక్కా మాస్ దర్శకుడు ఒక పక్కా మాస్ హీరోతో సినిమా తీస్తున్నాడంటే ఎవరికి చూడాలని వుండదు చెప్పండి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో వస్తున్న మూడవ సినిమా BB3పై చాలా అంచనాలు ఉండటం సహజం. ఎందుకంటే అంతకుముందు వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు మరి అంతటి ఘనవిజయం సాధించాయి. అయితే ఈ సినిమాలోని కొన్ని పాత్రల కోసం ఇప్పటికీ అన్వేషణ జరుగుతూనే వుంది.

sanjay-dutt-in-balakrishna-boyapati-movie-bb3

కొన్ని రోజులకు ముందు అందాల రాక్షసి హీరో నవీన్ చంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ చేస్తున్నాడని వినికిడి. మొదట్లో సంజయ్ దత్ ఈ సినిమాలో చేయడానికి నిరాకరించాడని, బాలకృష్ణ మాట్లాడంతో ఒప్పుకున్నాడని తెలుస్తుంది.

సంజయ్ దత్ త్వరలో కెజిఎఫ్ సినిమా ద్వారా అధీరా పాత్రలో మనముందుకు రానున్నాడు. కెజిఎఫ్ ఒక ప్యాన్ ఇండియా సినిమా కానీ BB3 మాత్రం ఒక ప్రాంతీయ భాషా సినిమా. మామూలుగా చూస్తే ఒక పెద్ద బాలీవుడ్ నటుడు ప్రాంతీయ సినిమాలలో చేయడానికి ఇష్టపడడు. అయితే బాలయ్య, బోయపాటి స్వయంగా రంగంలో దిగటం వల్లే ఇది సాధ్యమైందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ వార్త అధికారికంగా బయటకు రాలేదు. ఇదే నిజం అయితే బాలకృష్ణకు సరైన ప్రతినాయకుడు దొరికినట్టే.

సంజయ్ దత్ ఇంతక ముందు నాగార్జున చంద్రలేఖ సినిమాలో ఒక చిన్న పాత్రలో చేయడం జరిగింది. BB3లో సంజు నటిస్తున్నాడనే వార్త నిజమైతే అతనికిది తెలుగులో రెండో సినిమా అవుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫెర్ లో విజయ్‌ దేవరకొండ?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!