భారీ వర్షానికి ఉస్మానియా ఆస్పత్రి లోపలకి వర్షపు నీరు

తెలంగాణ: హైదరాబాద్‌ ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో భారీ వర్షం కారణంగా మురుగు నీరు లోపలకి చేరింది. బుధవారం మధ్యాహ్నం నాడు కురిసిన వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్‌ చాంబర్‌ సహా రోగుల వార్డులలోకి నీరు చేరింది. అయితే ఇలా ఆస్పత్రి లోపలకి వర్షపు నీరు ముంచెత్తడంతో వార్డుల్లో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. ఈ నీరు ఏకంగా రోగుల యొక్క బెడ్డుల వరకు రావడంతో ఆసుపత్రి సిబ్బంది కంగుతిన్నారు. వార్డులలోని బెడ్డుల దగ్గరకే కాకుండా కొన్ని చాంబర్స్ లోపలకి కూడా నీరు చేరింది.

osmania-hospital-inside-water-due-to-heavy-rain-in-hyderabad

శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో తరచూ పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడలకు పగుళ్లు రావడంతో చిన్నపాటి వర్షం కురిసినా నీరు లోపలలకి చేరుతుంది. అలాగే చుట్టుప్రక్కల ప్రదేశాలలో మురుగు నీటి వ్యవస్థ దెబ్బతినడంతో వర్షానికి ఆస్పత్రి ఆవరణలోని పలు మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. దీనితో వర్షపు నీటికి మురుగు నీరు తోడై ఇటు రోగులను అటు డాక్టర్లను ఇబ్బందికి గురిచేసింది. లాభంలేక కొంతమంది రోగులైతే వస్తున్న నీటికి పరుపులను అడ్డుపెట్టి బయటికి తోడటం జరిగింది. ఏమిచేయలేను వారు అలాగే ఉండిపోయారు. ఏదేమైనా ప్రభుత్వం రోగులకు ఇబ్బంది కలగకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

ఇంకా చదవండి: ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ లేనట్లేనా?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!