జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

బ్రేకింగ్ న్యూస్: ప్రజాకవి వరవరరావు ముంబయిలోని తలైజా జైలులో గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వరవరరావుకు మెరుగైన చికిత్స కోసం ముంబయిలోని జేజే ఆస్పత్రికి తరలించడం జరిగింది. అక్కడ పరీక్షించిన వైద్య సిబ్బంది కరోనా లక్షణాలు కనబడడంతో వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అయితే ప్రస్తుతానికి తన ఆరోగ్యం కుదురుగానే ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

corona-positive-for-varavara-rao-in-jail

ఎల్గార్ పరిషత్ కేసులో వరవరరావు మరియు మరో తొమ్మిది మంది కార్యకర్తలను పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే, దీనిని మొదట పూణే పోలీసులు విచారించారు మరియు తరువాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు బదిలీ చేశారు. అయితే వరవరరావు సుమారు 22 నెలలు పాటు జైలులోనే వున్నారు.

అయితే ఇదే విషయంపై కాంగ్రెస్ నేత చిదంబరం స్పందిస్తూ, జైలు శిక్ష అనుభవిస్తున్న కవి, కార్యకర్త వరవరరావును వెంటనే విడుదల చేసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పంపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఇంకా చదవండి: హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతికి కరోనా పాజిటివ్‌..!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!