ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!

ఆంధ్రప్రదేశ్: ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రజలకు మాస్కు తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ సూచనలను అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది.

wearing-mask-is-must-in-andhra-pradesh

రాష్ట్ర ప్రభుత్వం జారీచేయబడ్డ ఈ ఉత్తర్వుల్లో, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి పేర్కొంటూ, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారితో పాటు ప్రయాణాలు చేసేవారు అన్ని సమయాలలో తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని అన్నారు.

అయితే కరోనా వ్యాధి నియంత్రణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రోజుల్లో ప్రజలు మాస్క్‌ను ధరించడం ఒక అలవాటుగా చేసేలా స్థానిక జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా కోరారు. ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!