అలీ సైబర్ ఫిర్యాదు వెనుక పవన్ కళ్యాణ్ అభిమానులు..!

టాలీవుడ్: ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు సర్వసాధారణం అయిపోయాయి. ఒక సెలబ్రిటీ మీద పదుల సంఖ్యలో నకిలీ ఖాతాలు సృష్టించబడుతున్నాయి. కొన్ని సార్లయితే ఈ నకిలీ ఖాతాల ద్వారా కొంతమంది పోకిరీలు సెలబ్రిటీస్ యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇప్పుడు కమెడియన్ అలీ ఎదుర్కొన్నారు.

comedian-ali-cyber-complaint-on-fake-twitter-account-pawan-kalyan-fans

2019 ఎన్నికలలో, నటుడు అలీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరతారని పీకే అభిమానులు భావించారు, ఎందుకంటే ఇద్దరూ అటు తెరపై ఇటు తేరా వెనుక కూడా మంచి మిత్రులు. కానీ ఆలీ మాత్రం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అలీని ఉద్దేశించి ప్రచారంలో కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. పవన్ చేసిన కామెంట్స్ కు అలీ తనదైన శైలిలో జవాబిచ్చారు. అయితే ఎన్నికల తరువాత వీరి మధ్య దూరం పెరిగింది.

అసలు విషయానికొస్తే పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే హ్యాష్ ట్యాగును ట్రెండింగ్ చేస్తున్నారు. అదే హ్యాష్ ట్యాగ్ తో అలీ అకౌంట్ తో ఒక ట్వీట్ వైరల్ అయింది. అలీ ట్వీట్ చేసినట్లు చేసిన ఆ ట్వీట్ లో “వ్యక్తిత్వం లో నిన్ను ఓడించలేనప్పుడు నీ కులం గుణం వర్ణం గురించి మాట్లాడుతారు… ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించిన చెదరని నీ నవ్వుకి నీ సహనానికి శిరస్సు వంచి నమస్కారాలు” అని వుంది. దీనిని గమనించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఎన్నికల సమయంలో ఈ ప్రేమ ఏమైందన్నట్టుగా అలీ పేరుతో వున్న అకౌంట్ పై తిరగబడ్డారు.

ఈ విషయం అలీ చెవినబడటంతో, నిన్న అతను తన పేరు మీద ఉన్న నకిలీ ట్విట్టర్ ఖాతాను తొలగించాలని, ఖాతాదారుడిని శిక్షించాలని హైదరాబాదులో సైబర్ ఫిర్యాదు చేశారు.

ఇంకా చదవండి: ఆర్‌జివి పవర్ స్టార్ టికెట్ ధర 150.. బ్లాక్‌లో 250..!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!