బ్రేకింగ్ న్యూస్: ఏపీ ఎంసెట్ వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్: క‌రోనా వైరస్ వ్యాప్తితీవ్రత తగ్గనందున ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసు‌కుంది. ఏపీలో ఎంసెట్ స‌హా అన్ని‌ ప్ర‌వేశ ప‌రీక్ష‌లను వాయిదా వేస్తున్న‌ట్లు విద్యాశాఖ‌ మంత్రి ఆదిమూల‌పు సురేశ్ గారు ప్ర‌క‌టించారు. కోవిడ్-19 ప్రభావం దేశంలో రోజురోజుకి తీవ్రమవుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సూచ‌న‌తో ఎంసెట్ తో సహా ఇతర ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎంసెట్ తో పాటు ఐసెట్, ఈసెట్, లాసెట్, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌ల‌తో క‌లిపి మొత్తం 8 ప్రవేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు మంత్రి మీడియా ద్వారా తెలిపారు.

ap-eamcet-postponed-due-coronavirus-outbreak

అయితే సెప్టెంబ‌ర్ మూడో వారంలో ఎంసెట్ ప్రవేశ పరీక్ష నిర్వ‌హిస్తామ‌ని, దీనికి సంబంధించిన తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు. అలాగే జాతీయ ఎంట్రన్స్ పరీక్షలకు రాష్ట్ర ప్రవేశ పరీక్షా తేదీలు ఆటంకం రాకుండా నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. పరీక్షలకు సంబంధించిన అన్ని అంశాలపై సీఎం జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు.

కాగా డిగ్రీ, పీజీలో మొదటి, రెండో సంవత్సరం సెమిస్ట‌ర్ పరీక్షలు ఇప్పటికే జరగాల్సి ఉండగా వాటిని వాయుదా వేస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్‌లో డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహిస్తామ‌ని మంత్రి పేర్కొన్నారు.

తిరుమల: శ్రీవెంకటేశ్వరస్వామికి అజ్ఞాత భక్తుడు 20 బంగారు బిస్కెట్ల విరాళం

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!