పరోటా కోసం క్వారంటైన్ సెంట‌ర్ నుంచి బయటకొచ్చిన వైరస్ బాధితుడు..!

తమిళనాడు: కరోనా వల్ల రోజుకో న్యూస్ వైరల్ అవుతుంది. వ్యాధి సోకిన రోగులు ఎదో ఒక చిన్న చిన్న కారణాలతో పారిపోతున్నారు. కొత్తగా తమిళనాడులో ఒక రోగి పోరాటా తినాలనిపించి జనాల్లోకొచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో చోటుచేసుకుంది. ఒకవైపు తమిళనాడు దేశంలోనే కొరోనా పీడితుల రాష్టాల్లో మూడవ స్థానంలో ఉంటే, మరోవైపు ఇలాంటి ఘటనలు ప్రజలకు కలవరానికి గురిచేస్తున్నాయి. బయటకి వెళ్లకుండా కొన్ని రోజులు క్వారంటైన్ లో వుండండ్రా బాబు అని ప్రభుత్వం మొత్తుకుంటుంటే కొంతమంది రోగులు మాత్రం ఏముందిలే అనుకుంటున్నారు.

corona-virus-victim-came-out-of-quarantine-center-to-eat-parota

వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి జిల్లాలోని ఆచారిపాలెంలో ఒక ప్రభుత్వ స్కూల్ భవనాన్ని క్వారంటైన్ సెంట‌ర్ గా మార్చారు. అందులో సుమారు 150 మంది వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఓ కరోనా బాధితుడికి మాత్రం పరోటా తినాలని కోరిక కలిగింది. దీంతో అతను ఆలస్యం లేకుండా వెంటనే బయటకు వెళ్లి ఎలా అయినా పరోటా తెచ్చుకుని తినాలని నిర్ణయించుకన్నాడు. వెంటనే ఆ క్వారంటైన్ సెంట‌ర్ భవనం గోడ దూకి బయటకు వచ్చాడు. అయితే అతను బయటకు వచ్చే క్రమంలో నాలుగు ఇళ్లను దాటుకుంటూ రావడంతో ఇళ్లలో వాళ్ళు బయాందోళనలకు గురయ్యారు. చివరికి దగ్గర్లో ఉన్న ఓ టిఫిన్ దుకాణంలో పరోటా కొనుక్కుని తిరిగి ఆ భవనం లోపలకు వెళ్లాడు.

ఈ విహాయం తెలుసుకున్న స్థానికులు వెంటనే క్వారంటైన్ సెంట‌ర్ ఇక్కడి నుంచి మార్చాలని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రోగులకు కావలసిన సౌకర్యాలు లోపల లేకనే వారు బయటకు వస్తున్నారని కొంతమంది అంటున్నారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!