మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫెర్ లో విజయ్‌ దేవరకొండ?

మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫెర్ లో విజయ్‌ దేవరకొండ?: టాలీవుడ్‌లో ప్రముఖ నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. అతనికి సౌత్ ఇండియా అంతటా అభిమానులు ఉన్నారనడంలో సందేహం లేదు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంలో అద్భుతమైన నటనకు ఆయన మంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే గీతా గోవిందం, టాక్సీ వాలా వంటి సినిమాల ద్వారా  తెలుగు ప్రజలకు మరింత చేరువయ్యారు.

vijay-deverakonda-in-chiranjeevi-lucifer

ఇదిలా వుంటే మలయాళ చిత్రం ‘లూసిఫెర్’ తెలుగు రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న చిరంజీవి దాని దర్శకత్వ బాధ్యతలు సుజిత్ కు అప్పగించారు. అయితే లూసిఫెర్ లోని ఒక ముఖ్యమైన పాత్రకు విజయ్ దేవరకొండను ఎంచుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఇదే పాత్రను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాగా ఈ పాత్రను మలయాళంలో ప్రముఖ నటులు పృథ్వీ రాజ్ చేయటం జరిగింది.

చిరంజీవి మోహన్ లాల్ పాత్రను పోషిస్తుండగా, దేవరకొండ పృథ్వీ రాజ్ పాత్రను పోషించబోతున్నాడు. అయితే ఈ వార్తల గురించి అధికారిక ధృవీకరణ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!