అమితాబ్, అభిషేక్ లకు కరోనా పాజిటివ్..కంటైన్మెంట్ జోన్ లోకి అమితాబ్ ఇల్లు..

అమితాబ్, అభిషేక్ లకు కరోనా పాజిటివ్: భారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుందనేదానికి ఇదొక ఉదాహారణ. మనం చూస్తుంటాం, సెలెబ్రిటీలు, సినిమా ప్రముఖులు చుట్టూ పెద్ద సెక్యూరిటీ ఎల్లప్పుడూ ఉంటుంది. వాళ్ళమీద ఈగ కూడా వాలనీకుండా కొంతమంది సిబ్బంది ఎల్లప్పుడూ ఉంటారు. కానీ ఈ మహమ్మారి వాళ్ళని కూడా వదల్లేదు. కొత్తగా ఈ మహమ్మారి ఇప్పుడు బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ను పట్టుకుంది.

amitabh-abhisek-corona-virus-positive

వివరాల్లోకి వెళితే అమితాబ్ బచ్చన్ ఆరోగ్య సమస్యతో హాస్పిటల్ లో చేరాడని నిన్న కొన్ని టీవీ మాధ్యమాలలో బ్రేకింగ్ న్యూస్  వచ్చింది. ఇప్పుడు అది కొరోనా అని తేలడంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అమితాబ్ తో పాటుగా తన కొడుకు అభిషేక్ బచ్చన్ కి కూడా ఈ వైరస్ సోకింది. దీనికి సంబంధించి అమితాబ్ మరియు అభిషేక్ తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

అలాగే చివరి 10 రోజులలో నాతో దగ్గరగా వున్నవారు ఒకసారి కోవిడ్-19 పరీక్షలు చేయుంచుకోవాలని అమితాబ్ బచ్చన్ కోరారు. అలాగే తమ ఫ్యామిలీ మరియు స్టాఫ్ కూడా కోవిడ్-19 టెస్టులు చేయుంచుకుంటుందని తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ మరియు తెలుగు నటులు నాగార్జున, చిరంజీవి, రామ్ గోపాల్ వర్మ, కొరటాల శివ, ఇతరులు అమితాబ్ బచ్చన్ తొందరగా కోలుకోవాలని ప్రార్ధించారు. అయితే అమితాబ్ ఆరోగ్యం కుదురుగానే ఉందని తాజా సమాచారం.

మరోవైపు ముంబై మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు అమితాబ్ ఇల్లు "జల్సా" కు నోటీసులు అంటించారు. జల్సాను కంటైన్మెంట్ జోన్ గా పరిగణిస్తూ ఇంటి భయట నోటీసులు అంటించటం జరిగింది. ఆ 4 జిల్లాల్లో వైరస్ తీవ్రత ఎక్కువ.. జాగ్రత్త సుమా!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!