తెలంగాణలో నైరుతి రుతుపవనాలు: వర్షాలు పడే ప్రాంతాలు ఇవే..

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు: అందరు ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈసారి నైరుతి రుతుపవనాలు సరైన సమయానికే రాష్ట్రంలోకి అడుగుపెట్టాయని చెప్పొచ్చు. ప్రస్తుతం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నట్లు తెలుస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా కదలడంతో, భారత వాతావరణ శాఖ ఈ రోజు, రేపు రాష్ట్రంలోఒక మోస్తారు నుంచి భారీ వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది.

తాజా లెక్కల ప్రకారం జూన్ 1 నుండి జూలై 8 వరకు రాష్ట్రంలో 35 శాతం అధిక వర్షపాతం నమోదైంది, మహబూబ్‌నగర్, నాగర్‌కూర్నూల్, జోగులంబ గడ్వాల్‌కు అధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జూన్ 1 నుండి సాధారణ పరిధి కంటే 65 శాతం వర్షపాతం ఎక్కువగా నమోదైంది. అలాగే బుధవారం హైదరాబాద్‌లో 20 మి.మీ తేలికపాటి వర్షపాతం నమోదైంది. అయితే, ఎల్‌బి నగర్‌లోని కలవంచలో అత్యధికంగా 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, అల్వాల్‌లోని టెలికాం కాలనీలో 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

telangana-raining-season

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఒరిస్సా వరకు చత్తీస్ గఢ్ మీదుగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి ఏర్పడిందని ప్రకటించారు.

ఈ ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.

వర్షాలు పడే ప్రాంతాలు: ఆదిలాబాద్, కోమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!