జియో టీవీ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు?

టాలీవుడ్: రిలయన్స్ కొత్తగా జియో టీవీ ప్లస్ ను ప్రారంభించించిన విషయం తెలిసిందే! ఈ జియో టీవీ ప్లస్ ద్వారా 12 ఓటీటీ ప్లాటుఫార్మ్స్ యొక్క కంటెంట్ ను ఒకేచోట చూడొచ్చు. అంటే ఒక్క లాగిన్ తో శాటిలైట్ ఛానల్స్ మరియు ఓటీటీ కంటెంట్ చూసే వీలును జియో కల్పించబోతుంది. దీనికి సంబందించిన పనులు మొదలయ్యాయి. అయితే ఈ ప్రోడక్ట్ ప్రచారం కోసం సౌత్ ఇండియా నుంచి జియో, మహేష్ బాబును సంప్రదించిందని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియవలసి వుంది.

mahesh-babu-as-jio-tv-plus-brand-ambassador

నార్త్ ఇండియాలో ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తో జియో టీవీ ప్లస్ కు ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సౌత్ ఇండియాకు ఒక్క హీరోతోనే చేయించాలనే ఉద్దేశ్యంతో, అన్ని భాషల్లో మంచి గుర్తింపు ఉన్న మహేష్ బాబును సంప్రదించారట. ఈ విషయానికి సంబంధించి చర్చలు పూర్తి అయ్యాయని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందంటున్నారు. దీంతో మహేష్ బాబు అకౌంట్ లో మరో పెద్ద బ్రాండ్ చేరనుంది.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!