ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: ప్రైవేటు చికిత్స ధరలు ఇవే!

ఆరోగ్యశ్రీలోకి కరోనా ట్రీట్మెంట్: కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు ప్రైవేటు చికిత్స అందించేందుకు, వైద్యం కోసం ఆరోగ్య శ్రీ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖ తరుపున జీవో 77 విడుదలైంది. ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చుతూ నిర్ణయం తీసుకోగా, తాజాగా ఆయా ఆసుపత్రుల వర్గీకరణ, వైద్యానికి ధరలు నిర్ణయించడంతో అధికారకంగా కొరోనా చికిత్స ఇప్పుడు ఆరోగ్యశ్రీలోకి చేరింది.

aarogyasri-for-corona-treatment-in-private-hospitals

ఆరోగ్యశ్రీలోకి వచ్చే ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వాటిలో వైద్యానికి అయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది. ఆయా ఆసుపత్రులు వసూలు చేసే రుసుములు ఈ విదంగా ఉంటాయి.

  • నాన్ క్రిటికల్ పేషెంట్లకు రోజుకి రూ.3250

  • క్రిటికల్ కేర్ ఐసీయూలో వెంటిలేటర్ , ఎఐవీ అవసరం లేకుండా రోజుకి రూ.5480

  • ఐసీయూలో ఎన్ఏవీ చికిత్స రూ. 5980

  • ఐసీయూలో వెంటిలేటర్ తో చికిత్స రూ. 9,580..

  • వెంటిలేటర్ లేకుండా సెప్సిస్ చికిత్స రూ. 6,280

  • వెంటిలేటర్‌తో సెప్సిస్ చికిత్స రూ.10,380


అలాగే నాన్ క్రిటికల్ పేషెంట్లు ఎవరైనా ప్రత్యేక రూమ్ కావాలని ఆశిస్తే అదనంగా రోజుకి రూ.600 చొప్పున వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కరోనా వ్యాధిన పడిన వారికి కొంతవరకు ఉపశమనం దొరికింది. (కరోనా వ్యాప్తిలో మన దేశం ఏ దశలో వుంది?)

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!