ఆకాశం నీ హద్దురా! ట్రైలర్ విడుదల ఆ రోజేనా?

ప్రయోగాత్మక చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ సూర్య గత కొన్నేళ్లుగా విజయవంతమైన చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో సుర్యాకు బలమైన మార్కెట్‌ వుంది. అయితే వరుస ప్లాప్ చిత్రాల కారణంగా అతని మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, తమిళనాడు, కేరళలో కూడా క్రమంగా తగ్గుతోంది. అందుకే సూర్య తన రాబోయే చిత్రం ఆకాశం నీ హద్దురా! పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళంలో రిలీజ్ కానుంది. తెలుగులో వెంకటేష్ తో గురు సినిమా తీసిన సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహించింది.

suriya-aakasam-nee-haddura-trailer-release-date

ఆకాశం నీ హద్దురా! ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి. ఆర్. గోపీనాథ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాలో తెలుగు విలక్షణ నటుడు మోహన్ బాబు ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆయనతో పాటుగా జాకీ ష్రఫ్, అపర్ణ బాలమురళి, పరేష్ రావల్ మరికొంతమంది నటించారు.

ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టీజర్ మంచి స్పందనను పొందాయి. తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే, ఈ చిత్రం యొక్క ట్రైలర్‌ను జూలై 23 న సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం అనుకుంటుంది.

షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది, అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం విడుదల నిలిపివేయబడింది. ఈ చిత్రాన్ని సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు మరియు 2 డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో గునీత్ మోంగా మరియు సూర్యా నిర్మించారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి ట్యూన్స్ కంపోజ్ చేసారు.

ప‌వ‌ర్ స్టార్ మూవీ: ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ అంటున్న ఆర్జీవీ

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!