ఒకే కుటుంభలో ఏడుగురికి కరోనా.. అయితే వారు జయించారు!

గుజరాత్ (సూరత్): నాలుగు తరాల కుటుంభం అది, అందులో పదిమంది సభ్యులు, ఏడుగురికి కరోనా పాజిటివ్. అయితే వారు భయపడలేదు, అందరూ కలిసికట్టుగా జయించారు. ఇది సూరత్ లో జరిగిన ఒక ఆదర్శ ఫ్యామిలీ కథ. సామాన్యంగా ఇంట్లో ఒకరికి కరోనా వస్తే తోటివారే దూరానపెట్టే రోజులివి, చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలకు మరింత భయం. ఇలాంటి సంఘటనల గురించి రోజూ వింటూనే వున్నాము. అయితే వీరి కథ కరోనా వస్తే భయపడే వారికి ఆదర్శం కానుంది, భయపడకండి మమ్మల్ని చూడండి, మేము జయించాం అనే ధైర్యాన్నిచ్చే సంకేతాలను పంపుతుంది.

seven-members-of-surat-family-beat-corona-virus-together

వివరాల్లోకి వెళితే సూరత్ లోని ఒక కుటుంభంలో నాలుగు తరాల సభ్యులున్నారు. వారిలో అతిపెద్ద మనిషికి 106 సంవత్సరాలుంటే, అతి చిన్న వాడికి మూడున్నర ఏళ్ళ వయసు. వీరిద్దరితో పాటుగా ఇంకో ఐదుగురు మధ్య వయసు కలిగినవారికి కరోనా సోకింది. మిగిలిన ముగ్గురుకి కరోనా రాకపోవడంతో ముందు జాగ్రత్తగా వారి బంధువులింటికి పంపారు.

అయితే ఆ ఏడుగురి కుటుంభసభ్యులలో 106 ఏళ్ళ ముసలాయనికి, మూడున్నరేళ్ల పిల్లాడికి అసలు కరోనా వచ్చిందనే తెలియదు. ఈ  ఏడుగురు కొన్ని రోజులపాటు హోమ్ ఐసోలేషన్ లోనే తమ 3bhk ఫ్లాట్‌లోనే వున్నారు. అయితే వారు ఎప్పటికప్పుడు ఐసోలేషన్ జాగ్రత్తలు తీసుకుంటూ తమ ఫ్యామిలీ ఆయుర్వేద డాక్టర్ తో టచ్ లో ఉంటూ వచ్చారు. చివరికి వారు వారిపై నమ్మక్కంతో కరోనాను జయించారు.

ఐసోలేషన్ లో వున్న కుటుంబానికి చికిత్స చేసిన వైద్యులలో ఒకరైన డాక్టర్ మాట్లాడుతూ “ఒకే కుటుంబంలోని ఏడుగురు సభ్యుల కోలుకోవడం చాలా గొప్ప విషయం, ముఖ్యంగా వారి వయస్సు, వారి మానసిక పరిస్థితులను కూడా ప్రభావితం చేస్తుంది. కానీ వారి డ్యార్యానికి అభినందించాలి, వారు నమ్మకంతో కోలుకోవడానికి సూచించబడిన మార్గదర్శకాలను పాటించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా టెస్టు చేయించుకోవాలా.. ఐతే వెంటనే ఈ పని చేయండి!

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!