మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి..?

ఆంధ్రప్రదేశ్: రాజ్యసభ సభ్యులుగా మంత్రులు ఎన్నికైన కారణంగా, కొత్తగా ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గంలో జరిగే మార్పులలో వీరికి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఉప ముఖ్యమంత్రి అవకాశం రావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే బిసి వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఆ పదవిని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు ఇవ్వవచ్చని వైస్సార్సీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.

ap-minister-dharmana-krishnadas-likely-to-be-deputy-cm

అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కి రహదారులు భవనాలు శాఖ, శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు మత్స్య శాఖ లను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కొంతమంది ముఖ్యనేతలు చెప్తున్నారు. ఏదేమైనా అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!