‘పుష్ప’ సినిమా నుంచి తప్పుకున్నా.. కారణం అదే: విజయ్‌ సేతుపతి

టాలీవుడ్: అలవైకుంఠపురం లాంటి సూపర్ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా సినిమా "పుష్ప" లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఒక కీలకమైన పాత్ర కోసం తీసుకోవటం జరిగింది. అయితే మొదట్లో విజయ్ సేతుపతి కూడా ఆ పాత్ర చేయడానికి సానుకూలత వ్యక్తం చేశారు. కానీ షూటింగ్ కి కొన్ని రోజుల ముందు విజయ్ పుష్ప సినిమాలో చేయట్లేదని వార్తలు వినిపించాయి. దీనికి రకరకాల కారణాలతో సోషల్ మీడియాలో వేరువేరు కథనాలు ప్రచురితమయ్యాయి.

vijay-sethupathi-confirms-that-he-is-out-from-pushpa-movie

విజయ్ సేతుపతి ఇందులో చేయకపోటానికి కారణం రెమ్యూనరేషన్ అని కొంతమంది అంటే, కొందరేమో సైరా సినిమాలో తన పాత్రకు న్యాయం చేయకపోవటం వళ్ళ అతను ఈ సినిమాపై కూడా సందేహంతో వదులుకున్నాడని పుకారులు సృష్టించారు. అయితే ఇటీవల ఒక ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన విజయ్ సేతుపతి తాను ఎందుకు పుష్ప నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి ఇండియాలోనే ఒక బిజీ ఆర్టిస్ట్, తమిళం, హిందీ, మలయాళంతో పాటు తెలుగులో కూడా చేస్తున్నాడు. అటు హీరోగా ఇటు సపోర్టింగ్ రోల్స్ లో అదరగొడుతున్నాడు. అయితే తనకున్న బిజీ షెడ్యూల్లో డేట్స్‌ కుదరకపోవడం వల్లే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ సుకుమార్‌కు కలిసి వివరించానని అన్నారు. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప సినిమా చేయాలని ఉన్నప్పటికీ కొన్ని డేట్స్‌ లాక్ అవ్వటంతో తనవల్ల షూటింగ్‌కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే విజయ్ సేతుపతి స్థానంలో కన్నడ నటులు దునియా విజయ్, ధనుంజయ పేర్లు వినిపిస్తున్నాయి.

విజయ్ సేతుపతి తెలుగులో ఉప్పెన, తమిళంలో మాస్టర్, హిందీలో అమీర్ ఖాన్ సినిమాలతో త్వరలో మన ముందుకు రానున్నాడు. ఆకాశం నీ హద్దురా! ట్రైలర్ విడుదల ఆ రోజేనా?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!