విశాఖలో భారీ పేలుడు: భ‌యాందోళ‌న‌లో స్థానికులు

ఆంధ్ర ప్రదేశ్ (విశాఖ):  గత కొద్దీ రోజులుగా విశాఖలో ఎప్పుడూ లేని విదంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా ఇవి ఇండస్ట్రీలు వున్న ప్రాంతాలలో జరుగుతుండటం చర్చనీయాంశమైంది. కొత్తగా విశాఖ‌లోని రాంకీ ఫార్మాసిటీలో భారీపేలుడు స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. పెద్ద శబ్దాలతో పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి.

fire-blast-in-vizag-pharma-city

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనను మరువకముందే మరో ఘటన వైజాగ్ వాసులను టెన్ష‌న్ కు గురిచేసింది. పదే పదే  పేలుళ్లు జరగటంతో ఫైర్ సిబ్బంది మంట‌ల దగ్గ‌ర్లోకి వెళ్లలేకపోయారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి దూరంగా ఉండిపోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఫార్మాసిటీ పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానిక జనాలు తెలియచేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, కొద్దిసేపటి తరువాత ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగలిగారని తెలుస్తుంది.

బ్రేకింగ్ న్యూస్: ఏపీ ఎంసెట్ వాయిదా

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!