హైదరాబాద్ నిమ్స్‌లో మొదలైన భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌

తెలంగాణ: హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే బయోటెక్ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే. డీజీసీఏ భారత్ బయోటెక్‌కు రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులిచ్చింది. ఇప్పటికే జంతువులపై కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశంలోని 12 కేంద్రాలను ఐసీఎంఆర్‌ ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌) కూడా ఉంది.

bharat-biotech-covaxin-clinical-trials-begins-nims-hyderabad

ఈ క్రమంలో హైదరాబాద్ నిమ్స్‌లో అధికారులు క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. జులై 14 నుంచి నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ మొదలుపెట్టనున్నారు. కొంతమంది వాలంటీర్ల బ్లడ్‌ శాంపిల్స్‌ను సేకరించిన వైద్యులు వాటిని సెంట్రల్‌ ల్యాబ్‌కు పంపారు. కాగా, దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన చేసిన 12 కేంద్రాల్లో సుమారుగా 375 మందిపై ఈ కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ యొక్క మొదటి డోస్‌ను పరీక్షించనున్నారు.

అయితే హైదరాబాద్ నిమ్స్‌లో దాదాపు 60 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపే అవకాశం ఉంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. అందులో భారత్‌కు చెందిన సుమారు 6 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో పడ్డాయి.28 వేలకు పైగా తాజా కేసులు: 24 గంటల్లో ఇదే అతి పెద్ద సంఖ్య

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!