ఒకే సారి ఇద్దరి మెడలో తాళి: అటు ప్రియురాలు ఇటు కుదిర్చిన వివాహం

వైరల్ న్యూస్: సందీప్ అనే వ్యక్తి మధ్యప్రదేశ్ రాష్ట్రం కేరియాకు చెందినవాడు. భోపాల్‌లోని కాలేజీలో చదువుతున్నప్పుడు అతను ఒక మహిళతో ప్రేమలో పడ్డాడు. అయితే మొదట్లో ప్రేమ పెళ్ళికి తన కుటుంబం ఒప్పుకోలేదు. ఖచ్చితంగా తాము కుదుర్చిన వివాహం చేసుకోవాలని పట్టుబట్టారు. చివరికి ఈ పెళ్లిగోల ఊరులోని పంచాయితీ పెద్దలకు చేరింది.

man-married-both-lover-and-family-chosen-bride

పంచాయితీ పెద్దలు ఈ వ్యవహారంపై మూడు కుటుంబాలతో చర్చలు జరిపారు. ఏమైందో ఏమోగాని మూడు కుటుంబాలు సందీప్‌ ఇద్దరు మహిళలను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. కొన్ని రోజుల తరువాత, సందీప్ తన స్నేహితురాలు మరియు ఇంట్లో చూసిన మహిళతో సహా ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి వివాహం చేసుకున్నాడు.

కరోనా వ్యాధి సంక్రమణ కారణంగా, నగర అధికారుల అనుమతితో వివాహం చేసుకోవలసిన అవసరం ఉన్నప్పటికీ, అనుమతి లేకుండా వివాహం చేసుకోవటం జరిగింది. దీనితో రెండు పెళ్లిళ్ల వ్యవహారం బయట పడింది. ఈ విషయంలో అధికారులు వివాహంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఈ పెళ్లిపై నెటిజన్లు అవాక్కవుతున్నారు. కొందరు అతనికి సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు ఇది తప్పని ఖండిస్తున్నారు. ఒకవేళ ఇది తప్పయితే, అది ఖచ్చితంగా పెద్దెలదే అంటున్నారు. ఏదేమైనా అధికారులు జోక్యంతో ఈ రెండు పెళ్లిళ్లు సంగతి ఇప్పడు ఏమవుతుందో! మనిషి ముఖాన్ని తలపిస్తున్న మలేషియా చేప: ఫోటోలు వైరల్

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!