ఆర్జీవీ పవర్ స్టార్ లో చంద్రబాబు మాస్ ఎంట్రీ వుండబోతుందా!

టాలీవుడ్: రోజుకో ఫొటోతో పవర్ స్టార్ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కొత్తగా చంద్రబాబు పాత్రను పరిచయం చేశారని అర్ధమౌతుంది. ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ కళ్యాణ్ ఎదురుగా కూర్చున్న ఒక వ్యక్తితో సంభాషిస్తున్న ఫోటో ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఇది చంద్రబాబుని పోలివుండటం గమనార్హం.

chandrababu-naidu-role-in-power-star-movie

మొన్ననే త్రివిక్రమ్ శ్రీనివాస్, చిరంజీవిలను పోలివున్న నటుల ఫోటోలను వేరు వేరు యాంగిల్స్ లో విడుదల చేసిన ఆర్జీవీ కొత్తగా చంద్రాబు ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేశారు. అయితే ఈసారి మొహం కనిపించకుండా వెనుకనుంచి చూపించడం జరిగింది.

ఎన్నికలు పూర్తయిన తరువాత జరిగిన కథ అని చెప్పిన రామ్ గోపాల్ వర్మ, ఆ ఫొటోలో కనబడే సీన్ లో ఉద్రిక్తతలో వున్న పవన్ కళ్యాణ్ పాత్రను చంద్రబాబు పాత్ర ఓదారుస్తునట్టు వుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను పోలిన పాత్రలను ఆర్జీవీ వాడుకోవటం ఇది రెండోసారి. గతంలో అలా తీసిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు బాక్స్ ఆఫీస్ వద్ద విఫలమయ్యింది. ఏదేమయినా మరోసారి చంద్రబాబు మాస్ ఎంట్రీ పవర్ స్టార్ సినిమాలో ఉండబోతోందని తెలుస్తోంది. ప‌వ‌ర్ స్టార్ మూవీ: ఎన్నిక‌ల త‌ర్వాత జరిగిన క‌థ అంటున్న ఆర్జీవీ

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!