బిల్ గేట్స్, ఒబామా, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్

టెక్నాలజీ: రాజకీయ నాయకులు, టెక్ దిగ్గజ కంపెనీల ప్రముఖులు, ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తులు అలాగే పెద్ద కంపెనీల ట్విట్టర్ ఖాతాల్లోకి గుర్తు తెలియని హ్యాకర్లు బుధవారం ప్రవేశించారు. ఈ జాబితాలో మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ ఫ్రంట్-రన్నర్ జో బిడెన్, మైక్ బ్లూమ్‌బెర్గ్, అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్ వంటి అనేక మంది టెక్ బిలియనీర్ల ఖాతాలు వున్నాయి.

twitter-accounts-of-bill-gates-obama-musk-hacked

వీరి ట్విట్టర్ ఖాతాలలోకి ప్రవేశించిన హ్యాకర్లు ఆ అకౌంట్ కలిగివున్న వ్యక్తి పెట్టినట్లుగా ఒక ట్వీట్ చేశారు. ఉదాహరణకు, ఒబామా అకౌంట్ ద్వారా చేసిన ట్వీట్ ఇలా వుంది. "ఈ కోవిడ్-19 కారణంగా నేను నా ప్రజలకు తిరిగి ఇస్తున్నాను, మీరు కూడా క్రింది బిట్ కాయిన్ అడ్రసుకు ఇవ్వండి, తిరిగి మీ ఖాతాలోకి డబుల్ అమౌంట్ వస్తుంది, మీరు 1000 డాలర్లు ఇస్తే 2000 డాలర్లు తిరిగి మీ ఖాతాకు వస్తాయి, ఈ అవకాశం 30 నిమిషాల వరకు మాత్రమే ". ఇలా హ్యాకర్స్ వారి ట్విట్టర్ అనుచరులను అనామక బిట్‌కాయిన్ ఖాతాకు డబ్బు పంపించాలని ట్వీట్ చేయడం జరిగింది.  వెంటనే ట్విట్టర్ నకిలీ ట్వీట్లు అన్నీ తొలిగించినా, అప్పటికే చాలా మంది ఆ స్క్రీన్ షాట్స్ తీయడం జరిగింది.

అయితే ట్విట్టర్ వేరువేరు ట్వీట్ల ద్వారా స్పందిస్తూ మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, కొంతమంది మా యొక్క ఎంప్లాయిస్ ను టార్గెట్ చేసి మా ఇంటర్నల్ సిస్టంలోకి యాక్సెస్ పొందారని, అందువల్ల మా ఇంటర్నల్ సిస్టమ్స్, టూల్స్ యొక్క ప్రాప్యతను పరిమితం చేశామని పేర్కొంది.

ట్విట్టర్ ఏమంటోంది?

అయితే ట్విట్టర్ తమ ఖాతా నుంచి ఈ విషయంపై స్పందిస్తూ ఇలా అంది.

మా ఉద్యోగుల్లో కొంతమందిని లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులు మా అంతర్గత వ్యవస్థలు మరియు సాధనలలోకి ప్రవేశించారు. ఇది ఒక సమన్వయ సామాజిక ఇంజనీరింగ్ దాడి అని మేము నమ్ముతున్నాము.

ఈ సంఘటన గురించి మాకు తెలియగానే, మేము వెంటనే ప్రభావిత ఖాతాలను లాక్ చేసి, దాడి చేసినవారు పోస్ట్ చేసిన ట్వీట్లను తొలగించాము.

ఈ సంఘటనను మేము దర్యాప్తు చేస్తున్నాము మరియు దాన్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాము. మేము త్వరలో అందరినీ అప్‌డేట్ చేస్తాము.

ఇంకా చదవండి:

12 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ ఒకే చోట: జియో టీవీ+

త్వరలో 5జీ సేవలు: రిలయన్స్‌ జియో

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!