కప్పెలా మలయాళం రీమేక్ లో విశ్వక్ సేన్?

కప్పెలా మలయాళం రీమేక్ లో విశ్వక్ సేన్: సీతారా ఎంటర్టైన్మెంట్స్ మలయాళ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడానికి చాలా ఆసక్తి కనబరుస్తోంది. అంతకు ముందు మలయాళ క్లాసిక్ ప్రేమమ్ ను నాగ చైతన్యతో రీమేక్ చేసి మంచి హిట్ సాధించారు. ఇటీవల, మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ అయ్యప్పనమ్ కోషియం యొక్క రీమేక్ హక్కులనుసొంతం చేసుకున్నారు. ఈ రీమేక్ సినిమాలో రానా మరియు రవితేజ నటించనున్నారు. ఇప్పుడు సీతారా ఎంటర్టైన్మెంట్స్ మరో మలయాళ చిత్రం యొక్క తెలుగు హక్కులను సొంతం చేసుకుంది.

vishwak-sen-to-be-part-of-malayalam-remake

కప్పెలా మలయాళంలో రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. దీని తెలుగు రీమేక్ హక్కులను సీతారా ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. ప్రేమ కథకు కొంచం సస్పెన్స్ జోడించి తీసిన ఒక కొత్త రకం సినిమా అని చెప్పొచ్చు. తెలుగులో ఈ తరహా సినిమా కృష్ణ వంశీ గులాబీ అని చూపొచ్చు. కానీ ఇందులోని స్క్రీన్ ప్లే మనం తెలుగు సినిమాలో ఎప్పుడు చూడలేదు. ఇది లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు మలయాళంలో విడుదలై సానుకూల స్పందన అందుకుంది. ఆ తరువాత, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది.

అయితే కప్పెలా తెలుగు వెర్షన్ హీరో పాత్ర కోసం బలమైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది. శ్రీనాథ్ భాసి పోషించిన కీలక పాత్ర కోసం సీతారా ఎంటర్టైన్మెంట్స్ విశ్వక్ సేన్ ను సంప్రదించింది. విశ్వక్ సేన్ మళయాళ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పటికే స్వయంగా ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం అంగమలై డైరీస్ ఫలుక్నామా దాస్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

అయితే విశ్వక్ సేన్ ఈ ప్రాజెక్ట్ మీద సంతకం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ హెచ్ఐటి సీక్వెల్ మరియు పాగల్ సినిమాలతో బిజీగా వున్నారు. శ్రీనాథ్ భాసి పాత్రలో విశ్వక్ సేన్ జీవిస్తాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే, అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. మెగాస్టార్‌ చిరంజీవి లూసిఫెర్ లో విజయ్‌ దేవరకొండ?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!