మొదలవనున్న విదేశీ విమాన సర్వీసులు.. వివరాలు ఇవే..

ఢిల్లీ: కోవిడ్-19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన విమాన స‌ర్వీసులు మెల్లిమెల్లిగా ప్రారంభమవుతున్నాయి. భరత్ విషయానికి వస్తే శుక్రవారం అమెరికా నుంచి, శనివారం ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు ఈవారం రెండు అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని పౌరవిమానయాన శాఖ మంత్రి మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి మీడియా ద్వారా వెల్లడించారు. అలాగే జర్మనీతో కూడా విమాన సర్వీసుల ప్రారంభంపై సంప్రదింపులు జరిపామని మీడియాముఖంగా తెలియచేశారు.

india-announces-flight-services-delhi-france-newark

అయితే ఇకపై నిత్యం ఢిల్లీ నుంచి నెవార్క్‌కు విమానాలు వెళ్లనున్నాయి అలాగే ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకు వారంలో మూడు రోజులు పాటు విమానాలు వెళ్లనున్నాయి. అదే విధంగా యునైటెడ్ ఎయిర్లైన్స్ జులై 17 నుంచి 31 వరకు 18 విమానాలను ఇండియాకు తిప్పనుంది. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్ ఫ్రాన్స్ ఢిల్లీ, బెంగళూరు, ముంబాయిల నుంచి పారిస్‌లకు జూలై 18 నుంచి ఆగస్ట్ 1 వరకు 28 విమానాలను తిప్పనుంది. వీటికి తోడు మరిన్ని విమానసంస్థలు ముందుకు వస్తున్నాయనేది సమాచారం. ఈ ఏడాది క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్స్ లేనట్లేనా?

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!