రాణీని దత్తతు తీసుకున్న ఉపాసన రాంచరణ్..!

హైదరాబాద్: అపోలో ఆసుపత్రి వైస్ చైర్మన్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య ఉపాసన 31వ జన్మదినం కావడంతో ఆమె సోమవారం హైదరాబాదులోని జూ పార్క్ ను సందర్శించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి రాణి అనే ఏనుగును దత్తత తీసుకున్నారు.

upasana-ramcharan-adopted-rani-elephant-from-zoo-park-hyderabad

ఇకపై రాణి యొక్క బాగోగులను ఉపాసన రాంచరణ్ చూసుకోనున్నారు. ఈ మేరకు ఆమె నెహ్రూ జూలాజికల్ పార్క్ అధికారులకు 5 లక్షల రూపాయల చెక్ అందించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు జంతువుల పట్ల ప్రేమ పూరితంగా వ్యవహరించాలని అలాగే స్వచ్చందంగా జూ లో ఉండే జంతువులను ముందుకు వచ్చి దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఉపాసన  అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Comments

Popular posts from this blog

విరసం నేత వరవరరావును నానావతి ఆసుపత్రికి తరలింపు..

జైలులో వరవరరావుకు కరోనా పాజిటివ్‌..!

ఇంటి నుంచి బయటకు వస్తే ఇక మాస్కు తప్పనిసరి..!